AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: చిన్న పొదుపు.. భారీ లాభం.. అధిక వడ్డీల పేరుతో వసూలు చేసిన మహిళ.. చివరికీ..!

పొదుపు పేరుతో కొంత మందిని, వడ్డీల పేరుతో మరి కొంతమందిని నమ్మించి రూ. 50 లక్షలకు పైగా నగదు వసూలు చేసుకోవడమే కాకుండా, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు వేధింపుల కేసులు పెట్టింది.

Andhra Pradesh: చిన్న పొదుపు.. భారీ లాభం.. అధిక వడ్డీల పేరుతో వసూలు చేసిన మహిళ.. చివరికీ..!
Cheating Case
J Y Nagi Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 23, 2024 | 5:52 PM

Share

అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసానికి పాల్పడుతున్న మహిళ గుట్టురట్టైంది. ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేసి, కటకటాల వెనక్కు నెట్టారు. పొదుపు పేరుతో కొంత మందిని, వడ్డీల పేరుతో మరి కొంతమందిని నమ్మించి రూ. 50 లక్షలకు పైగా నగదు వసూలు చేసుకోవడమే కాకుండా, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు వేధింపుల కేసులు పెట్టింది. చివరకు అసలు విషయం తెలిసి పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

అదోని ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి నారాయణ సింగ్, అతని భార్య పద్మావతి బాయిల కూతురు ప్రీతి సింగ్. ఇంటి వద్దనే చీరల వ్యాపారం, టైలరింగ్ చేస్తూ మహిళలతో పరిచయాలు పెంచుకుంది. చిట్టీలు వేసుకుని, డబ్బులు పొదుపు చేసుకొమని నమ్మించి కొంపముంచింది. ఈ క్రమంలోనే చిట్టీల పేరుతో తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసానికి పాల్పడింది. మరి కొందరిని అధిక వడ్డీ ఆశజూపి అందినకాడికి వసూలు చేసింది. గత 15 నెలలుగా చిట్టి పూర్తి అయినా డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేస్తుండటంతో అనుమానంతో బాధితులు నిలదీశారు. నెల లోపు డబ్బులు తిరిగి ఇస్తామని నచ్చ చెప్పి పంపారు.

చివరికి నెలలు దాటినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇంటికెళ్ళిని బాధితులపై దౌర్జాన్యానికి పాల్పడింది ప్రీతి సింగ్ కుటుంబం. చివరికి విసిగిపోయిన బాధితులు పోలీస్ స్టేషన్‌లో ర్యాదు చేయడానికి వెళితే, అక్కడా, ప్రీతి సింగ్ వారికి షాక్ ఇచ్చింది. తమ వల్ల ప్రాణాపాయం ఉన్నట్టు ప్రీతి సింగ్, జిల్లా ఎస్పీకి స్పందనలో పిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. ఇక పోలీసులకు అసలు విషయం వివరించడంతో చీటింగ్ కేసు నమోదు చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..