AP Corona Bulletin: ఏపీ కరోనా బులెటిన్ విడుదల.. 212 కొత్త కరోనా కేసులు నమోదు.. నలుగురు మృతి..
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెట్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా 212 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24..
AP Corona Bulletin: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెట్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా 212 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 37,381 శాంపిల్స్ టెస్ట్ చేయగా, 212 పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,81,273 మంది కరోనా బారిన పడ్డారు. కాగా, నేడు 410 మంది కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక 24 గంటల వ్యవధిలో కరనా మహమ్మారి కారణంగా నలుగురు మృత్యువాత పడ్డారు. దాంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 7,098కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,423 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
ఇక జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల సంఖ్యను చూసుకున్నట్లయితే అత్యధికంగా గుంటూరులో 53 మంది కరోనా బారిన పడ్డారు. ఆ తరువాత చిత్తూరులో 42 మందికి కరోనా సోకింది. కృష్ణాలో 32 మంది, తూర్పుగోదావరి 21, అనంతపురం 13, విశాఖపట్నం 13 చొప్పున కరోనా కేసులు నమోదు అయ్యాయి.
Also read: