Yerragondapalem jr ntr flex : “ఏపీకి నెక్ట్స్ సీఎం తారక రామారావే”..సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫ్లెక్సీ
ప్రకాశం జిల్లాలో ఫెక్సీ ఇప్పుడు తెగ హల్‌చల్ చేస్తోంది. రోడ్డుపై నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ పెట్టిన భారీ ఫ్లెక్సీ..ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రకాశం జిల్లాలో ఫెక్సీ ఇప్పుడు తెగ హల్‌చల్ చేస్తోంది. రోడ్డుపై నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ పెట్టిన భారీ ఫ్లెక్సీ..ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏపీకి నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలో పొందుపరిచారు టీడీపీ అభిమానులు. ఏపీకి తదుపరి సీఎం నందమూరి తారక రామారావు అంటూ ఎర్రగుంట్ల పాలెంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో కుర్చీలో కాలు మీద కాలు వేసుకున్న తారక్ ఫోటో ఉంది. ఇదే ఫ్లెక్స్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, బాలయ్య, హరికృష్ణ, అచ్చెన్నాయుడు..ఇతర స్థానిక నాయకుల ఫోటోలు ఉన్నాయి. మొదట ఈ ఫ్లెక్సీ చూసి టీడీపీ నేతలు వర్గాలుగా చీలిపోయారు. కొందరు అందులో తప్పేముందని ఆఫ్ ది టాక్ ప్రశ్నిస్తుండగా..మరికొందరు ఆ ఫ్లెక్సీకు, తమకు ఏం సంబంధం లేదని చెబుతున్నారు.