AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ముసుగేసినోడు మామూలోడు కాదు.. మస్త్ షేడ్స్ ఉన్నాయ్.. మ్యాటర్ తెలిస్తే కళ్లు తేలేస్తారు

సాధారణంగా దొంగతనం జరిగిన చోట.. ఏవైనా ఫింగర్ ప్రింట్స్ లేదా ఇతర క్లూస్ కోసం పోలీసులు సెర్చ్ చేస్తుండటం కామన్. అయితే ఇక్కడ ఓ దొంగ అత్యంత అనూహ్యంగా ఓ చిన్న క్లూతో పోలీసులకు దొరికిపోయాడు. అదేంటంటే ఈ వార్త చూసేయండి.

Andhra: ముసుగేసినోడు మామూలోడు కాదు.. మస్త్ షేడ్స్ ఉన్నాయ్.. మ్యాటర్ తెలిస్తే కళ్లు తేలేస్తారు
Eluru
B Ravi Kumar
| Edited By: |

Updated on: Jun 06, 2025 | 12:38 PM

Share

కొన్నిసార్లు నేరం జరిగిన చోట లభించే చిన్న క్లూ నిందితుడిని పోలీసులకు పట్టిస్తుంది. నేరస్తుడి వేలిముద్రలు, సీసీ కెమెరా ఫుటేజ్, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఇలా చాలా అంశాలు పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా శోధించి కేసును సాల్వ్ చేస్తారు. కానీ ఈ కేసులో నిందితుడి వేసుకున్న కొత్త చెప్పులు అతడిని కటకటాల వెనక్కినెట్టాయి. అవ్వడానికి పాత నేరస్తుడే అయినా రోజుల వ్యవధిలోనే దొరికిపోయాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా పోలవరం పరిధిలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. పోలవరం జగన్నాథునిపేటలో ఒక ఇంట్లో 29.43 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, నగదు చోరికి గురైయ్యయి. పాత నేరస్తులు ఎవరైనా చోరి చేసారా అనే కోణంలో సీసీ కెమెరాలు పరిశీలించారు పోలీసులు. పోలవరానికి సంబంధించిన పాత నేరస్తుడు అరగంట వ్యవధిలో ఆ ప్రాంతాలకు వచ్చి వెళ్ళినట్టు కదలికలు గుర్తించారు. దీంతో చోరి జరిగిన ప్రాంతంలో వేలిముద్రలు, పాదముద్రలు సేకరించారు. వాటిని పరిశీలించి పాత నేరస్తుడు గంగాజలం చోరి చేసినట్టు గుర్తించారు. కానీ నిందితుడు తనకు సంబంధం లేదని చాలా రోజుల పాటు బుకాయించాడు. అయితే చోరీ చేసిన రోజు నిందితుడు తొడిగిన కాలి చెప్పులు కూడా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ చెప్పులు కొత్తవి. దాంతో ఆ చెప్పులు ఎక్కడ కొనుగోలు చేసారో స్థానికంగా దుకాణాలు వద్ద ఎంక్వైరీ చేసారు. రాజమహేంద్రవరంలో ఆ చెప్పులు ఫలానా షాపులో కొనుగోలు చేసి ఉండొచ్చని స్థానిక షాపుల వాళ్లు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు ఆ షాపునకు వెళ్లి సీసీ కెమెరాలు పరిశీలించారు. అక్కడ గంగాజలం చెప్పులు కొనుగోలు చేసినట్టు వీడియో రికార్డు అయ్యింది. గంగాజలంను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేపట్టారు పోలీసులు. కోడిపందాలు, జూదం కోసం దొంగతనం చేసినట్టు పోలీసుల విచారణలో తెలిపాడు నిందితుడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..