Lokesh: పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిపడటంపై ఏపీలో మొదలైన పొలిటికల్ రగడ.. లోకేష్ ట్వీట్‌తో ఆరోపణల పర్వం షురూ..
భారీ వర్షాలు, వరద నీటితో పూర్తిస్థాయి నీటితో తొణికిసలాడుతోన్న పులిచింతల ప్రాజెక్టు గేటు ఒక్కసారిగా విరిగి పడి కొట్టుకుపోయిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా..
Nara Lokesh – Pulichintala Project Tweet: భారీ వర్షాలు, వరద ఉధృతి వల్ల పూర్తిస్థాయి నీటితో తొణికిసలాడుతోన్న పులిచింతల ప్రాజెక్టు గేటు ఒక్కసారిగా విరిగి పడి కొట్టుకుపోయిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన విమర్శలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైయస్ఆర్ హయాంలో జరిగిన జలయజ్ఞంలో అవినీతి వల్లే, నిర్మాణ లోపం జరిగి గేటు కొట్టుకుపోయిందంటూ ఆరోపించే ప్రయత్నం చేశారు లోకేష్.
దీనికి సంబంధించి లోకేష్ ఇలా ట్వీట్ చేశారు. “జలయజ్ఞం పేరుతో మహా”మేత”… దరిద్ర పాదం ఎఫెక్ట్ తో ఊడిపడిన గేటు… సముద్రంపాలవుతున్న లక్షల క్యూసెక్కుల జలాలు… తండ్రి హయాంలో జరిగిన అవినీతి తనయుడి హయాంలో బయటపడటమే దేవుడి స్క్రిప్ట్.” అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు.
ఇలా ఉండగా, పులిచింతల గేటు నిన్న ఊడిపడ్డంపై ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ రగడ ఇవాళ మొదలైంది. ఇప్పటివరకూ ప్రభుత్వం తరఫున అందరూ కూల్ గానే ఉండగా, ఇప్పుడు లోకేష్ ట్వీట్ తో వైసీపీ, టీడీపీ మధ్య వార్ షురూ అయింది. ఇక, ఏపీలో రెండు మూడు రోజుల పాటు పులిచింతల గేటు యుద్ధం రాజకీయ పార్టీల్లో జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
జలయజ్ఞం పేరుతో మహా”మేత”… దరిద్ర పాదం ఎఫెక్ట్ తో ఊడిపడిన గేటు… సముద్రంపాలవుతున్న లక్షల క్యూసెక్కుల జలాలు… తండ్రి హయాంలో జరిగిన అవినీతి తనయుడి హయాంలో బయటపడటమే దేవుడి స్క్రిప్ట్. pic.twitter.com/KZLQxqIkaH
— Lokesh Nara (@naralokesh) August 6, 2021