Nara Lokesh: నాన్న వదిలినా.. నేను వదలను.. నారా లోకేష్ శపథం..
Nara Lokesh Comments on YSRCP Leaders: ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాల అనంతరం రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఆ తర్వాత అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ మధ్య మాటల తూటాలు
Nara Lokesh Comments on YSRCP Leaders: ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాల అనంతరం రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఆ తర్వాత అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో టీడీపీ నేతలపై జరిగిన దాడులు మరింత ఆజ్యంపోశాయి. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా, లోకేష్ పలువురు నేతలు దాడులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. అయితే.. అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలపై మరోసారి నారా లోకేష్ స్పందించారు. మంగళగిరిలో నారా లోకేష్ మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీలో తన తల్లిని కించపరిచిన వాళ్లని తన నాన్న (చంద్రబాబు నాయుడు) వదిలినా తాను వదలనంటూ శపథం చేశారు. ఎంతో నిబద్ధతతో నిజాయితీతో ప్రజా సేవ చేస్తున్నా.. అవమానించడం ఎంటంటూ ప్రశ్నించారు. తమ కుటుంబాన్ని ఏదో ఒక విషయంలో బయటి లాగటానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందంటూ విమర్శించారు. ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్న వారంతా రానున్న కాలంలో తీవ్ర పరిమాణాలు ఎదుర్కొంటారంటూ హెచ్చరించారు. నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ మీద దాడి చేయించిన ఈ ప్రభుత్వం.. నేడు సొంతపార్టీ వాళ్ల మీద దాడులు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ విమర్శించారు.
గుంటూరు జిల్లాలోని పెదనందిపాడులోని వెంకటనారాయణపై వైసీపీ కార్యకర్తల దాడులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిన్న ట్విట్టర్ వేదికగా ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని దూషిస్తోన్న వైసీపీ కార్యకర్తలను ప్రశ్నించడమే నేరమా అంటూ నిలదీశారు. తప్పుని తప్పని చెబితే చంపేస్తారా? అంటూ ప్రశ్నించారు.
గుంటూరు జిల్లా పెదనందిపాడు @ysjagan జన్మదిన వేడుకల్లో చంద్రబాబు గారిని దూషిస్తోన్న వైసీపీ శ్రేణులను ప్రశ్నించడమే దళితుడైన వెంకటనారాయణ చేసిన నేరంగా మద్యం సీసాలతో కొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించిన రాక్షసమూకల చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/3) pic.twitter.com/1QJUgAYFrd
— Lokesh Nara (@naralokesh) December 21, 2021
Also Read: