Mudragada Padmanabham: కోడి పందాలపై ఏపీ ముఖ్యమంత్రికి లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం
Mudragada Padmanabham: సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. ఈ పండగ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఏపీలో కోడిపందాలు. పండగకు నెల రోజుల ముందు నుంచే కోండిపందాలకు..
Mudragada Padmanabham: సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. ఈ పండగ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఏపీలో కోడిపందాలు. పండగకు నెల రోజుల ముందు నుంచే కోండిపందాలకు సిద్ధమవుతుంటారు. కోడి పందాలతో రాష్ట్రంలో కోలాహాలంగా ఉంటుంది. అయితే ఈ పందాలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. అయినా ఎక్కడో చోటు జరుగుతూనే ఉంటాయి. ఇక తాజాగా ఈ కోడి పందాలపై కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. సంక్రాంతి పండగ సందర్భంగా కోడి పందాలు, ఎడ్ల పందాలు జరుపుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆయన లేఖలో కోరారు. సంక్రాంతికి, ఉగాది పండగలకు ఐదు రోజుల పాటు ఈ పందాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ఈ కోడిపందాలు, ఎడ్ల పందాలు జల్లికట్టు కన్నా ప్రమాదకరమైనవి కావని, ప్రజలను జైలుకు పంపకుండా చూడాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.
ముఖ్యంగా ఈ కోడి పందాలు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో జోరుగా సాగుతుంటాయి. దీంతో ప్రభుత్వం ఇప్పటి నుంచి కోడి పందాలపై నిఘా పెడుతుంటుంది. ఎక్కడ పందాలు జరుగకుండా పోలీసులు చర్యలు చేపడుతుంటారు. తర్వాత వారు కోర్టుకు వెళ్లడం, ప్రభుత్వం నిషేధించడం ప్రతి సారి జరుగుతున్నదే.
ఇవి కూడా చదవండి: