Raghu Rama Krishna Raju: సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి రఘురామకృష్ణంరాజు.. నేడు వైద్య పరీక్షలు..
Raghu Rama Krishna Raju Case: ఆంధ్రప్రదేశ్ నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఆయన్ను పోలీసులు సోమవారం
Raghu Rama Krishna Raju Case: ఆంధ్రప్రదేశ్ నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఆయన్ను పోలీసులు సోమవారం రాత్రి ఏపీ నుంచి సికింద్రాబాద్‌కు తరలించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏపీ పోలీసులు గుంటూరు జిల్లా జైలు నుంచి ప్రత్యేక వాహనంలో ఆయనను రోడ్డు మార్గంలో సికింద్రాబాద్‌కు తరలించారు. దీంతో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకృష్ణంరాజుకు వైద్యులు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ రోజు మంగళవారం పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్యపరీక్షలను వీడియో తీయాలని.. నివేదికను సీల్డ్ కవర్‌లో అందించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలు అమలయ్యేలా ఏపీ సీఎస్ చర్యలు తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో వైద్య పరీక్షల పర్యవేక్షణకు తెలంగాణ హైకోర్టు నియమించిన న్యాయాధికారి సైతం ఆర్మీ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే.. మరో నాలుగు రోజులపాటు రఘురామకృష్ణరాజు ఆర్మీ ఆసుపత్రిలో ఉండే అవకాశం ఉంది.
రఘురామకృష్ణం రాజు బెయిల్ పిటిషన్‌తోపాటు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం వాదనలు జరిగాయి. రఘురామకృష్ణరాజు తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, ఆదినారాయణరావు, ఏపీ ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే, వీవీ గిరి వాదనలు వినిపించారు. బెయిల్ మంజూరుతోపాటు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందించేందుకు రఘురామకు అవకాశం కల్పించాలని రోహత్గీ కోర్టును కోరారు. ఎంపీని అరెస్ట్ చేసిన తీరును, ఆతర్వాత జరిగిన పరిణామాలను న్యాయస్థానానికి వివరించడంతో.. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Also Read: