Illegal Business: ఆగని రెమిడెసివిర్ అక్రమ దందా.. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..!
కరోనా బాధితులకు ప్రాణదాతగా భావిస్తున్న రెమిడెసివిర్ ఇంజక్షన్ల ఆసరగా చేసుకుని, కొందరు కేటుగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారు.
Remdesivir Illegal Business: కరోనా బాధితులకు ప్రాణదాతగా భావిస్తున్న రెమిడెసివిర్ ఇంజక్షన్ల ఆసరగా చేసుకుని, కొందరు కేటుగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతూ అక్రమ దందాకు తెరలేపారు. గుట్టు చప్పుకు కాకుండా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. వరుస దాడుల్లో రెమ్ డెసివిర్ ఇంజక్షన్లను అమ్ముతున్న దగాకోరులను పట్టుకుంటున్నా.. మరో ఘటన జరగడంతో బ్లాక్ దందా యథేచ్చగా కొనసాగుతుందనడంలో సందేహం లేదు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో ఓ ముఠాను పోలీసులు, వైద్యాధికారులు కలిసి పట్టుకున్నారు. కరోనా పేషెంట్లకు అధిక ధరలకు రెమిడెసివర్ ఇంజక్షన్లను అమ్ముతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. దీంతో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఏలూరు పోలీసులు విచారణ చేపట్టారు
కరోనా బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే ఇంజెక్షన్లను అక్రమంగా రవాణా చేస్తున్నారు. అంతేకాదు ఇంజక్షన్లను ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నట్లు ఏలూరు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి హెటేరో కంపెనీకి చెందిన 8 ఇంజెక్షన్లను ఒక సెల్‌ఫోన్‌ను, ఒక వాటర్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.