COVID-19 Woman: కరోనా సోకిన 45 ఏళ్ల మహిళపై లైంగిక వేధింపులు.. రంగంలోకి దిగిన పోలీసులు
COVID-19 Woman: దేశంలో కామాంధులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వారిపై పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. వారిలో మార్పు రావడం లేదు. మహిళలపై లైంగిక వే..
COVID-19 Woman: దేశంలో కామాంధులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వారిపై పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. వారిలో మార్పు రావడం లేదు. మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయి. తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో ఓ మహిళ కోవిడ్ సోకి ఐసీయూలో చికిత్స పొందుతోంది. 45 ఏళ్లు ఉన్న ఆ మహిళపై కొందరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆమె కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కరోనా బారిన పడిన ఆ మహిళ ఇటీవల చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరింది. ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే తన తల్లిపై ముగ్గురు లైంగికంగా వేధిస్తున్నారని పోలీసుల ముందు కుమార్తె తెలిపింది. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఆమె కుమార్తె ముగ్గురి పేర్లను చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రిలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇలాంటి మానవ మృగాళ్లు చివరికి కరోనా సోకిన రోగులను కూడా వదిలి పెట్టడం లేదు. ఇలాంటి వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పలువురు పోలీసులను కోరుతున్నారు.
Bihar: Daughter of a 45-yr-old woman – who is admitted to the ICU ward of a hospital in Patna – alleges that her mother, who is also a #COVID19 patient, was sexually assaulted there.
Police say, “Investigation is on. Questioning being done. CCTV footage is being examined.” pic.twitter.com/tRDprKYz4g
— ANI (@ANI) May 17, 2021
ఇవీ చదవండి:
GHMC Fever Survey: కోవిడ్ నియంత్రణలో భాగంగా హైదరాబాద్‌లో 1680 బృందాలతో 1,73,757 ఇళ్లలో సర్వే