GHMC Fever Survey: కోవిడ్ నియంత్రణలో భాగంగా హైదరాబాద్‌లో 1680 బృందాలతో 1,73,757 ఇళ్లలో సర్వే
GHMC Fever Survey: కోవిడ్ నియంత్రణలో భాగంగా తెలంగాణ సర్కార్ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ లకు చెందిన 1680 బృందాలు సోమవారం..
GHMC Fever Survey: కోవిడ్ నియంత్రణలో భాగంగా తెలంగాణ సర్కార్ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ లకు చెందిన 1680 బృందాలు సోమవారం 173757 ఇళ్లలో సర్వేను చేపట్టాయి. ఏఎన్‌ఎం, ఆశ వర్కర్, జీహెచ్ఎంసీ వర్కర్ తో కూడిన 1680 బృందాలు ఇంటింటికి తిరిగి జ్వరంతో బాధ పడుతున్నవారి వివరాలను సేకరించారు. జ్వరం కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది యాంటీ లార్వా ద్రవాన్ని పిచికారి చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 9,98,373 ఇళ్లలో సర్వే నిర్వహించారు. నగరంలో ప్రతీ బస్తి దవాఖాన, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇతర దావాఖానాలలో అవుట్ పేషంట్ కు జ్వరం పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో సోమవారం కూడా, అన్ని ఆసుపత్రుల్లో 16999 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇప్పటివరకు ఆసుపత్రుల ద్వారా మొత్తం 2,19,333 మందికి జ్వరం పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కోవిడ్ కంట్రోల్ రూమ్ కు కేవలం కరోనా సంబంధిత సలహాలు, సూచనలకు వచ్చిన ఫోన్ కాల్స్ కు ప్రత్యేకంగా నియమించిన వైద్యాధికారులు తగు సలహాలు, సూచనలు అందించారు.