AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kesineni Nani Vs Chinni: చిన్నికి టికెట్ ఇస్తే నా మద్దతు ఉండదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కేశినేని నాని.. పీక్స్ చేరిన బెజవాడ బ్రదర్స్ వార్..

బెజయవాడ టీడీపీలో బ్రదర్స్ వార్ జరుగుతోంది. ఎంపీ కేశినేని నాని సోదరుడు చిన్ని స్థానికంగా యాక్టివ్ అవ్వడంతో అన్నదమ్ముల మధ్య విభేదాలు సంక్రాంతి రోజు మరింత పెరిగినట్లు సమాచారం.

Kesineni Nani Vs Chinni: చిన్నికి టికెట్ ఇస్తే నా మద్దతు ఉండదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కేశినేని నాని.. పీక్స్ చేరిన బెజవాడ బ్రదర్స్ వార్..
Kesineni Nani Vs Chinni
Sanjay Kasula
|

Updated on: Jan 15, 2023 | 6:33 PM

Share

బెజవాడ టీడీపీలో మళ్లీ బ్రదర్స్ వార్ షురూ అయింది. అన్నదమ్ముళ్ల పంచాయితీ పీక్‌ స్టేజ్‌కు చేరినట్లే కనిపిస్తోంది. తమ్ముడు కేశినేని చిన్నిని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు ఎంపీ కేశినేని శ్రీ‌నివాస్ అలియాస్ నాని. విజ‌వాడ టీడీపీ ఎంపీగా ఉన్న కేశినేని నానికి కేశినేని శివ‌నాద్ అలియాస్ చిన్ని స్వయాన సోద‌రుడు. చిన్నికి టికెట్ ఇస్తే తన మద్దతు ఉండదని స్పష్టంగా చెప్పారు. చిన్నే కాదు మరో ముగ్గురు వ్యక్తులకు టికెట్ ఇచ్చినా తన సపోర్ట్ ఉండదని తేల్చేశారు. అయితే ఎవరా ముగ్గరు అన్నది మాత్రం చెప్పలేదు. చిన్నిపై పరోక్షంగా చాలా హాట్‌ కామెంట్స్ చేశారు నాని. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పోటీ చేసే హక్కు ఉందని.. ఛార్లెస్ శోభరాజ్‌, దావుద్ ఇబ్రహీం, సెక్స్ రాకెట్, కాల్ మనీ చేసేవాళ్ళు కూడా పోటీ చేయవచ్చు అంటూ చిన్నిని టార్గెట్ చేశారు.ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వస్తున్న వార్తలపైనా స్పందించారు నాని. తాను ఢిల్లీ స్థాయి నేతనని చెప్పుకొచ్చారు. పార్టీ అవసరాల మేరకు తనను ఎక్కడైనా వాడుకోవచ్చని అన్నారు.

నియోజ‌క‌వ‌ర్గాల వారీగా పార్టీ ప‌రిస్థితులు, అన్న నాని గెలుపు అవ‌కాశాలపై ఎప్పటిక‌ప్పుడు పరిశీలిస్తై.. నాని గెలుపులో కీల‌క పాత్ర పోహించారు చిన్ని. గత ఏడాది అగస్టు నుంచి ఇద్దరి మ‌ధ్య విభేదాలు రావ‌టంతో కేశినేని నానికి దూరంగా ఉంటున్నారు చిన్ని. అయితే, త‌న ఎంపీ కారు స్టిక్కర్‌ను దుర్వినియోగం చేస్తున్నారంటూ విజ‌య‌వాడ‌ ప‌ట‌మ‌ట పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు ఎంపీ నాని. దీంతో నాని, చిన్ని మ‌ధ్య విభేదాలు వెలుగులోకి వచ్చాయి.

ఇదిలావుంటే, కేశినేని చిన్ని రాజ‌కీయంగా దూకుడు పెంచారు. ఇందులో భాగంగానే ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న శాస‌నస‌భ స్థానాలపై గురి పెట్టారు. పార్టీ క్యాడ‌ర్ ను క‌లిసి ఇకపై యాక్టివ్ కావాల‌ని పిలుపు నివ్వటంతో పాటు, తాను ఉన్నాననే భ‌రోసా క‌ల్పించేందుకు ప్రయ‌త్నిస్తున్నారు చిన్ని. అయితే ఇదంతా ఎంపీ నానికి వ్యతిరేకంగా జ‌రుగుతుందా అంటే మాత్రం పార్టీ నేత‌లు నోరు మెదపడం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం