Daggubati Venkateswara Rao: ప్రస్తుత రాజకీయాలపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు విరక్తి.. అందుకే ఈ నిర్ణయమా..? వీడియో

Daggubati Venkateswara Rao: ప్రస్తుత రాజకీయాలపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు విరక్తి.. అందుకే ఈ నిర్ణయమా..? వీడియో

Anil kumar poka

|

Updated on: Jan 15, 2023 | 5:25 PM

ప్రకాశం జిల్లా ఇంకొల్లులో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల వేదికపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసిన ప్రకటన ఇది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు.

ఎన్టీఆర్‌ పెద్దల్లుడిగా దగ్గుబాటికి గుర్తింపు ఉంది. TDP స్థాపన సమయంలో హరికృష్ణతో పాటు ఎన్టీఆర్‌ కలిసి అడుగేశారు దగ్గబాటి. అప్పట్లో వరసగా మూడుసార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఎంపీగా ఉన్నారు. టీడీపీ సంక్షోభం తర్వాత మాత్రం బీజేపీలో చేరారు దగ్గుబాటి. ఆ తర్వాత 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్‌లో ఉన్నారు. పర్చూరు నుంచే రెండుసార్లు గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు ఐదేళ్లు సైలెంట్‌గా ఉన్న దగ్గుబాటి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పర్చూరు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.ఓటమి తర్వాత కూడా పెద్దగా రాజకీయాలు మాట్లాడని ఆయన.. ఇప్పుడు పూర్తిగా స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 15, 2023 05:25 PM