AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rayalaseema: సీమకు జల’సిరి’.. ఉప్పొంగిన హృదయాలు.. రిజర్వాయర్‌లో ఈత కొట్టిన ఎంపీ

రాయలసీమను ఎప్పుడు కరువు కాటకాలు వెంటాడుతూ ఉంటాయి. రాష్ట్రమంతా కుంభవృష్టి కురుస్తున్నా.. చుక్క నీటి కోసం ఆశగా ఆకాశం కేసి చూసే ప్రాంతం అది.

Rayalaseema: సీమకు జల'సిరి'.. ఉప్పొంగిన హృదయాలు.. రిజర్వాయర్‌లో ఈత కొట్టిన ఎంపీ
Mp Gorantla Madhav
Ram Naramaneni
|

Updated on: Nov 28, 2021 | 7:04 PM

Share

రాయలసీమను ఎప్పుడు కరువు కాటకాలు వెంటాడుతూ ఉంటాయి. రాష్ట్రమంతా కుంభవృష్టి కురుస్తున్నా.. చుక్క నీటి కోసం ఆశగా ఆకాశం కేసి చూసే ప్రాంతం అది. కానీ, ఇప్పుడు వరుణుడు కరుణించడంతో కరువు సీమ జలకళతో కొత్త అందాన్ని సంచరించుకుంది. చెరువులు, కుంటలు నిండు కుండలుగా మారాయి. భూగర్భ జలాలు ఉప్పొంగి ఉబికి వస్తున్నాయి. ఒకప్పుడు అనంతపురం జిల్లా.. ఎడారి జిల్లాను తలపించేది. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడంలేదు. పుష్కలంగా నీరు చేరడంతో ఎడారి కాస్తా కోస్తాను తలపిస్తోంది.

కరవు సీమ అనంతలో నీటి ప్రవాహాలు చూసి ప్రజలే కాకుండా ప్రజాప్రతినిధుల ఆనందానికి కూడా అవధులు లేకుండా పోతున్నాయి. చాలా ప్రాంతాల్లో నీటిలో ఈత కొడుతూ గ్రామస్థులు సందడి చేస్తుంటే.. తాము కూడా ఈ ఆనందానికి అతీతం కాదంటూ ఎంపీ గోరంట్ల మాధవ్ రిజర్వాయర్ లో దూకి ఈత కొట్టారు. దాదాపు 22ఏళ్ల తరువాత రామగిరి మండలం పేరూరు డ్యాంకు పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చింది. రెండు దశాబ్ధాల తరువాత గేట్లు ఎత్తడంతో స్థానికంగా ఉన్న ప్రజల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. డ్యాం వద్ద ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్ గంగపూజ నిర్వహించారు. అనంతరం తెప్పపై వెళ్తూ రిజర్వాయర్ లో నీటి సందడిని చూశారు. అయితే ఈ ఆనందాన్ని తట్టుకోలేక ఎంపీ గోరంట్ల మాధవ్ నీళ్లలో దూకి ఈత కొడుతూ సందడి చేశారు. మాధవ్ నీటిలో దిగి ఈత కొడుతుంటే.. ప్రజలు ఈలలు కేకలతో హోరెత్తించారు.

విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అనంతపురం జిల్లాలో పెన్నా నది మహోగ్రరూపం దాల్చింది. ఎగువన భారీ వర్షాలు పడుతుండడంతో వరదనీరు పోటెత్తింది. దీంతో నదిపై ఉన్న అన్ని డ్యాముల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు అధికారులు. అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇలా వరద గేట్లు తెరిచి నీటిని విడుదల చేయడం డ్యాం చరిత్రలో ఇదే తొలిసారి. అలాగే అప్పర్ పెన్నార్, మిడ్ పెన్నార్, చాగల్లు రిజర్వాయర్ల గేట్లు కూడా ఎత్తారు అధికారులు.

Also Read: ఏపీకి వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరిక.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

 ‘CM ఎన్టీఆర్’ నినాదాలతో మారుమోగిన కుప్పం.. ఒక్కసారిగా తారక్ ఫ్యాన్స్ ప్రభంజనం

జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్‌.. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్
ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్‌.. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్
'మీరు తోపులకు బాప్‌.. మీ సినిమాను ఎవడూ ఆపలేడు: టాలీవుడ్ నటుడు
'మీరు తోపులకు బాప్‌.. మీ సినిమాను ఎవడూ ఆపలేడు: టాలీవుడ్ నటుడు
మహిళా ఎస్సై చెంప చెళ్లుమనిపించిన మద్యం వ్యాపారి కూతురు
మహిళా ఎస్సై చెంప చెళ్లుమనిపించిన మద్యం వ్యాపారి కూతురు