Fire in Running‌ Car: రన్నింగ్‌ కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. అసలు ఏం జరిగింది..?(వీడియో)

Fire in Running‌ Car: రన్నింగ్‌ కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. అసలు ఏం జరిగింది..?(వీడియో)

Anil kumar poka

|

Updated on: Nov 29, 2021 | 9:44 AM

ఈ మధ్య కాలంలో వాహనాల్లో మంటలు రావటం సాధారణం అయిపోయింది. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వై జంక్షన్ వద్ద కారులో మంటలు చెలరేగాయి... విజయవాడ వైపు వెలుతున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి...

ఈ మధ్య కాలంలో వాహనాల్లో మంటలు రావటం సాధారణం అయిపోయింది. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వై జంక్షన్ వద్ద కారులో మంటలు చెలరేగాయి… విజయవాడ వైపు వెలుతున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి…అయితే అదృష్టవశాత్తు కారులో ఉన్నవారేవరికీ ఎలాంటి గాయాలు కాకుండా బయట పడ్డారు. గుంటూరు నుంచి డీఎస్పీ తన కుటుంబ సభ్యులతో ఫోర్డ్ కారులో విజయనగరం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వై జంక్షన్ వద్దకు రాగానే కారు ఇంజిన్‎లో మంటలు వ్యాపించాయి..దీంతో కారులో ప్రయాణిస్తున్న వారు వెంటనే అప్రమత్తమై బయటకు దిగారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు రావడానికి షార్ట్ సర్క్యూటే కారణమని అగ్నిమాపక అధికారులు గుర్తించారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Srikanth on MAA Elections: కొంచెం బాధగా… కొంచెం సంతోషంగా ఉంది.. మరోసారి ‘మా’ ఎలక్షన్స్ పై శ్రీకాంత్ మాటల్లో..(వీడియో)

 Coal crisis In India: దేశంలో కరెంట్‌ కోత.. బొగ్గు కొరతకు కారణాలేంటి ?(వీడియో)

 Warning to Beer Lovers: బీర్ ప్రియులకు హెచ్చరిక..! ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు..(వీడియో)

 Railway Jobs: పదో తరగతితో రైల్వేలో ఉద్యోగాలు.. 2,226 పోస్టులకు దరఖాస్తులు..(వీడియో)

Published on: Nov 29, 2021 08:49 AM