MP Gorantla: పోలీసుల విచారణకు నా సెల్‌ఫోన్ ఇచ్చేందుకు సిద్ధం.. కమ్మలకు ఆయనే వ్యతిరేకి.. ఎంపీ గోరంట్ల
Andhra Pradesh: న్యూడ్ వీడియో విచారణలో భాగంగా పోలీసులకు తన సెల్‌ఫోన్ ఇవ్వడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నట్లు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla) తెలిపారు. టీవీతో మాట్లాడిన ఆయన 'పోలీసుల విచారణకు నా సెల్ ఫోన్ ఇవ్వడానికి నేను ఎప్పుడైనా సిద్ధం...
Andhra Pradesh: న్యూడ్ వీడియో విచారణలో భాగంగా పోలీసులకు తన సెల్‌ఫోన్ ఇవ్వడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నట్లు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla) తెలిపారు. టీవీతో మాట్లాడిన ఆయన ‘పోలీసుల విచారణకు నా సెల్ ఫోన్ ఇవ్వడానికి నేను ఎప్పుడైనా సిద్ధం. అదేవిధంగా కమ్మ కులం వారికి క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నాను. అయితే ఫేక్ వీడియోను సృష్టించి నాపై దుష్ర్పచారం చేసిన వారికి మాత్రం క్షమాపణలు చెప్పేది లేదు. రాష్ట్రంలో కమ్మకులస్తులకు వ్యతిరేకి ఎవరైనా ఉంటే అది టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమే. నీళ్లకు పాచి చేటు.. కమ్మలకు చంద్రబాబు అంత చేటు. ఈ వివాదాన్ని ఇప్పటికైనా ఆపండి. ప్రజల కోసం పని కొచ్చే వాటిని చూపించండి’ అని ఎంపీ హితవు పలికారు.
కాగా హైదరాబాద్ నుంచి అనంతపురం జిల్లాకు వెళ్తున్న ఎంపీకి కర్నూలు సరిహద్దు టోల్ గేట్ వద్ద కురుమ సంఘం ఘన స్వాగతం పలికింది. టోల్ ప్లాజా నుంచి బళ్లారి చౌరస్తా వరకు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మాధవ్‌కు మద్దతుగా.. టీడీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ అమెరికా ల్యాబ్ లో ఒరిజినల్ వీడియో అని, మార్ఫింగ్ చేయలేదు అని తేలినట్లు టీడీపీ నేతలు చెప్పడం దుర్మార్గామన్నారు. టీడీపీ నేతలే కాకి డ్రెస్ వేసుకున్న పోలీసుల్లా, జడ్జిల్లా, సైంటిస్టుల్లా, ఇతర అధికారుల్లా తీర్పులు..ఉత్తర్వులు ఇచ్చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..