Anantapuaram: పరువు హత్యకేసులో ఎంపీ మాధవ్ ఎంట్రీ.. పరిటాల సునీత, పయ్యావుల స్పందించాలని డిమాండ్

మురళిని ఎవరు చంపారనే రెండో మాటకు తావు లేకుండా తన తల్లే ఇలా చేయించించని చెప్పేసింది. పోలీసులకు ఇదే విషయం చెబుతూ కూతురు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న కురుబ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎంపీ మాధవ్ సీన్ లోకి ఎంటర్ కావడంతో మ్యాటర్ మరింత సీరియస్ అయింది.

Anantapuaram: పరువు హత్యకేసులో ఎంపీ మాధవ్ ఎంట్రీ.. పరిటాల సునీత, పయ్యావుల స్పందించాలని డిమాండ్
Defamation Case In Anantapu
Follow us

|

Updated on: Jun 20, 2022 | 3:18 PM

Anantapuaram: నాభర్తను చంపిన వాడిని చంపే వరకు నా బొట్టు తీయను.. సీమలో బుసలు కొట్టే మహిళల పౌరుషాలు ఇలా ఉంటాయి. పరువు కోసం ప్రాణాలు తీయడానికైనా.. తీసేందుకైనా వెనుకాడని గడ్డ అది. కానీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సొంత అల్లునిపై కత్తి కట్టింది ఓ అత్త. పరాయి కులం వాడు నా బిడ్డ మెడలో తాళి ఎలా కడుతాడు.. సంసారం ఎలా చేస్తాడు.. వాడిని చంపాల్సిందే.. ఆ అత్త అన్న మాటల తేలిగ్గా తీసుకున్నారో ఏమో తెలియదు.. కానీ ఆ అల్లుడుని అత్యంత దారుణంగా గొంతు కోసి చంపారు..

పౌరుషంతో కత్తి దూసే సీమలో ఫ్యాక్షన్ పగలు చల్లారాయి కానీ.. పరువు కోసం వస్తే మళ్లీ పాత రోజులు గుర్తు చేసుకునే స్థాయిలో పగలు కక్షలు రేగుతున్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.. అనంతపురం జిల్లా కేంద్రానికి సమీపంలో జరిగిన ఓ యువకుని దారుణ హత్య. కియా పరిశ్రమలో ఉద్యోగం చేసే ఆ యువకున్ని సినిమా ఫక్కీలో కిడ్నాప్ చేసి మరీ గొంతు కోసి కర్కశంగా చంపారు. ఆ యువకుని తప్పేంటి అంటే.. కనగానపల్లికి చెందిన కురుబ మురళి.. ఆ యువకుడు చేసిన తప్పు ప్రేమ వివాహం చేసుకోవడం. తన కులం కానీ అమ్మాయిని.. అదే గ్రామానికి చెందిన వీణను ప్రేమించాడు.  ఉద్యోగాలు వచ్చిన తరువాత పెళ్లి చేసుకుందామని భావించారు. ఇంతలో మురళికి కియా పరిశ్రమలో ఉద్యోగం వచ్చింది. వీణ సచివాలయ వ్యవస్థ వచ్చిన సమయంలో మహిళా పోలీస్ గా ఉద్యోగం సాధించింది. ఇక ఇంట్లో చెబితే ఎలాగో ఒప్పుకోరని భావించి.. ఏడాది క్రితం పెన్నహోబిళం లక్ష్మినరసింహస్వామి ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 8 నెలల క్రితం నుంచి రాప్తాడు ఎస్సీ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

వీణకు తండ్రి లేడు.. ఐదేళ్ల క్రితం చనిపోయాడు. కూతురే ఆమె తల్లికి దిక్కు. అయితే వేరే కులం వాడిని పెళ్లి చేసుకున్నావ్ వాడిని చంపేస్తా నువ్ దగ్గరకు వచ్చేయ్ అంటూ సొంత తల్లే బెదిరింపులకు పాల్పడింది. సాధారణంగా ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు ఇలాంటివి సహజం అని వీణ భయపడ్డా కొంచెం లైట్ తీసుకుంది. కానీ నేను విధవను  ఉన్నాను.. నువ్ కూడా అలానే ఉంటావ్ అంటూ తల్లి శబధాలు చేసేది. కానీ కొన్నిరోజులుగా ఎలాంటి అలజడి లేదు. అటు వైపు నుంచి ఎలాంటి బెదిరింపులు కూడా లేవు.

ఇవి కూడా చదవండి

అయితే అనుకోని సంఘటన. ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో మురళి ఇంటి నుంచి బైక్‌పై వచ్చి రాప్తాడు వై జంక్షన సమీపంలోని పెట్రోలు బంకులో పెట్టి..  కియ పరిశ్రమకు వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తున్నాడు. అదే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక వాహనంలో వచ్చారు. అందరూ చూస్తుండగానే మురళిని బలవంతంగా వాహనంలోకి తీసుకెళ్లారు. అయితే అక్కడున్న వారు వారించగా.. మురళీ మా వాడే.. మాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. అంతే రాప్తాడు మండలం లింగనపల్లి శివారు పొలాల్లో అతడి గొంతు కోసి, దారుణంగా చంపి పడేశారు. డ్యూటీకి వెళ్లిన తన భర్త శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఇంటికి రావాల్సి ఉండగా, ఎంతసేపటికీ రాలేదు. అతని సెల్‌కు ఫోన్ చేసినా పనిచేయలేదు.. తెల్లారే వరకు చూద్దాం అని వీణ వెయిట్ చేసింది…

తెల్లారినా భర్త రాలేదు.. అంతే అనుమానం ఎక్కువైంది. వెంటనే పరుగు పరుగున పెట్రోలు బంకు వద్దకు వెళ్లి తన భర్త ద్విచక్రవాహనం ఉందో లేదోనని చూసింది. వాహనం అక్కడే ఉన్నా, తన భర్త ఇంటికి రాకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు.. , రాప్తాడు వైజంక్షన సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. వాహనంలో కొందరు వ్యక్తులు మురళిని బలవంతంగా ఎక్కించుకొని వెళ్లడాన్ని గుర్తించారు. ఇంతలోనే లింగనపల్లిలో గుర్తు తెలియని శవం కనిపించడం.. అది మురళిదేనని గుర్తించడం జరిగింది. ఒక్కసారిగా వీణ ఆవేదనకు అంతే లేకుండా పోయింది. మురళి తల్లి గుండె పగిలేలా ఏడ్చింది. ఎంత పని చేశార్రా దుర్మార్గుల్లారా అంటూ బోరున ఏడ్పులు. అయితే మురళిని ఎవరు చంపారనే రెండో మాటకు తావు లేకుండా నా తల్లే ఇలా చేయించించని చెప్పేసింది. పోలీసులకు ఇదే విషయం చెబుతూ ఆమె ఫిర్యాదు చేసింది.

విషయం తెలుసుకున్న కురుబ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎంపీ మాధవ్ సీన్ లోకి ఎంటర్ కావడంతో మ్యాటర్ మరింత సీరియస్ అయింది. బాధిత కుటుంబాన్ని మాధవ్ పరామర్శించారు. తమ సామాజిక వర్గాన్ని గడ్డి కోసినట్టు ఊచకోత కోస్తున్నారు.. అయినా తాము రెట్టింపు సంఖ్యలో వస్తున్నామంటూ మాధవ్ ఫైర్ అయ్యారు. కానీ మాధవ్ ఈ విషయంలో మాజీ మంత్రి పరిటాల సునీతను టార్గెట్ చేశారు. కేవలం ఆమె ఒక్కరినే కాదు అదే సామాజిక వర్గానికి చెందిన ప్రభాకర్ చౌదరి, పయ్యావుల కేశవ్ లాంటి నేతలు దీనిపై స్పందించాలని.. మీ వాళ్లు ఎలా చేస్తున్నారో చూడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కులం కోసం ఇలా కిరాయి హంతకులతో హత్యచేయిస్తారా.. ఇలాంటి వారిని ఉరితీయాలని గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు…

ఎక్కడైనా కూతురు పసుపుకుంకుమలు బాగుండాలని కోరుకుని తల్లులను చూసి ఉంటాం… కానీ కులాంతర వివాహం చేసుకుందని నువ్ కూడా నాలాగే విదవ గా తిరిగేలా చేస్తానని శబధం చేసిన తల్లి.. సీమ చరిత్రలో ప్రత్యేక రెడ్ ఇంక్ వేసింది. నాగరికత ఎంత ఆధునికం వైపు అడుగులు వేస్తున్నా.. ఇంకా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం.. దీనిపై రాజకీయాలు జరగడం బాధాకరం.

Reporter: Kanth, TV9 Telugu

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..