MP Avinash Reddy: మళ్లీ సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మురం చేసింది. ఈరోజు సీబీఐ విచారణనకు కడప ఎంపీ అవివాష్ రెడ్డి హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ ముందు హాజరయ్యారు. ఇటీవల ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మురం చేసింది. ఈరోజు సీబీఐ విచారణనకు కడప ఎంపీ అవివాష్ రెడ్డి హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన మరోసారి సీబీఐ ముందు హాజరయ్యారు. ఇటీవ అవివాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పడు తాజాగా ఆయన మూడో శనివారం సీబీఐ ముందుకు రావడం చర్చనీయాంశమైంది. అయితే మూడోసారి సీబీఐ ముందు హాజరుకానున్న అవినాష్ రెడ్డి వాంగ్మూలాన్ని సీబీఐ రికార్డు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అయితే ఇటీవల అవినాష్ రెడ్డికి కోర్డు షరతులు విధించి ముందస్తు బెయిల్ ఇచ్చింది. అంతేకాకుండా ఈ షరతుల్లో ప్రతి శనివారం రోజన సీబీఐ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అలాగే సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని చెప్పింది. ఈ విచారణలో అవినాష్ రెడ్డిని ఏం అడుగుతారో అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..