కసాయి కొడుకు.. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని.. తల్లిపై ఏం చేశాడంటే
కాయాకష్టం చేసుకుని కొడుకుని పెంచి పెద్ద చేసింది. తాను ఆకలితో ఉన్నా.. బిడ్డు కడుపు నిండటమే ముఖ్యమనుకుంది. కుమారుడి కోసం సర్వం త్యాగం చేసి, మలి దశకు చేరింది. వృద్ధాప్యంలో ఆదరించాల్సిన...
కాయాకష్టం చేసుకుని కొడుకుని పెంచి పెద్ద చేసింది. తాను ఆకలితో ఉన్నా.. బిడ్డు కడుపు నిండటమే ముఖ్యమనుకుంది. కుమారుడి కోసం సర్వం త్యాగం చేసి, మలి దశకు చేరింది. వృద్ధాప్యంలో ఆదరించాల్సిన కొడుకు ఆమె పాలిట యముడిగా మారాడు. వ్యసనాలకు బానిసై జులాయిగా తిరిగేవాడు. మద్యం తాగేందుకు ఉన్న పొలాన్నీ అమ్మేశాడు. ఇంకా డబ్బు కావాలనడంతో తల్లి ఇవ్వలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురై.. తల్లిపై గడ్డపారతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి(Murder) చెందింది. నెల్లూరు(Nellore) జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్‌పేట గ్రామంలో నెల్లూరు సుబ్బమ్మ అనే వృద్ధురాలు తన కుమారుడు కన్నయ్యతో కలిసి నివాసముంటోంది. వీరికి మూడున్నర ఎకరాల పొలం ఉంది. ఈ క్రమంలో కన్నయ్య వ్యసనాలకు బానిసయ్యాడు. మద్యం(Wine) తాగి అప్పులపాలయ్యాడు. నిత్యం నగదు ఇవ్వాలని తల్లిని వేధించేవాడు.
దీంతో చేసేదేమీలేక రెండెకరాలు తాకట్టు పెట్టి నగదు ఇచ్చింది. ఇంకా డబ్బులు కావాలని హింసించడంతో డబ్బు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కన్నయ్య గడ్డపారతో తల్లి తలపై బలంగా కొట్టాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read
Hyderabad: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..