Seetharama Swamy: సీతారామ స్వామి మందిరం వద్ద ఓ అపురూప దృశ్యం.. విగ్రహాల వద్ద వానరం
Seetharama Swamy: హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్..
Seetharama Swamy: హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తుంటాం. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలోని బెజ్జిపల్లి గ్రామంలోని సీతారామ స్వామి మందిరం వద్ద ఓ అపురూప దృశ్యం కనిపించింది. అక్కడి ఆలయ గోపురంపై ఉన్న సీతారామలక్ష్మణ హనుమాన్ విగ్రహాల వద్ద ఓ వానరం కొద్దిసేపు కూర్చుంది. శ్రీరామచంద్రుడికి రెండుచేతులు జోడించి దండంపెట్టగా ఆంజనేయ విగ్రహాన్ని చూసుకుంటు కొద్దిసేపు అక్కడే వానరం నిలిచిపోయింది. ఈ వానరాన్ని చూసేందుకు గ్రామస్తులు చేరుకోగా మరికొందరు దైవానుగ్రహాం అంటు దండం పెట్టుకున్నారు. కాగా, ఇలాంటి దృశ్యాలు మనకు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. ఇలా వచ్చిన వానరాలను చూసి భక్తులు ఎంతో మురిసిపోతుంటారు. సాక్షత్తుగా ఆ హనుమంతుడే వచ్చినట్లుగా భావిస్తుంటారు.