ఫింగర్ ప్రింట్‌తో మనీ విత్‌డ్రా ఈజీయే అనుకున్నారు.. కానీ.! తీగ లాగితే డొంక కదిలినట్టయింది..
ఆధార్ ద్వారా డబ్బు తీసుకునే విధానం చాలా చోట్ల అమల్లో ఉంది. కొంతమంది కేటుగాళ్లు వీటిని ఆసరాగా చేసుకుని 3 రోజుల వ్యవధిలో రూ. 10 లక్షలు కాజేశారు. వీటికి కేవలం ఫింగర్ ప్రింట్స్‌ను మాత్రమే పెట్టుబడిగా పెట్టారు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటి.? అసలెక్కడ జరిగిందో ఇప్పుడు చూసేద్దామా..!
ఆధార్ ద్వారా డబ్బు తీసుకునే విధానం చాలా చోట్ల అమల్లో ఉంది. కొంతమంది కేటుగాళ్లు వీటిని ఆసరాగా చేసుకుని 3 రోజుల వ్యవధిలో రూ. 10 లక్షలు కాజేశారు. వీటికి కేవలం ఫింగర్ ప్రింట్స్‌ను మాత్రమే పెట్టుబడిగా పెట్టారు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటి.? అసలెక్కడ జరిగిందో ఇప్పుడు చూసేద్దామా..!
ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా నగదు డ్రా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో బాధితుల ఫింగర్ ప్రింట్స్ సేకరించి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్(AEPS) ద్వారా డబ్బులు విత్ డ్రా చేశారు. ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా నాలుగు రోజుల్లోనే పది లక్షలకు పైగా మనీని డ్రా చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. పేమెంట్ సిస్టమ్‌ను మిస్ యూజ్ చేస్తూ నగదు విత్ డ్రా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు.
ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఎలాంటి ఓటీపీ, అకౌంట్ డీటెయిల్స్ ద్వారా రూ. 10 వేల వరకు మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. దీంతో నిందితులు సుమారు 2500 మంది ఫింగర్ ప్రింట్స్‌ను మీ-సేవ సెంటర్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో తీసుకున్నారు. వారి అకౌంట్‌లో ఉన్న మనీని ఫింగర్ ప్రింట్స్ ఉపయోగించి పీఓఎస్ మిషన్ ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకున్నారు.
ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ సిస్టమ్ సర్వీసెస్ అందిస్తున్న ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(FINO bank) ఇచ్చిన కంప్లెయింట్ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులంతా నగదు విత్ డ్రా చేయడానికి ఇమేజ్ ప్యాక్ స్టాంప్ మిషన్, సీమాందర్ మిషన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేశారని సీసీఎస్ జాయింట్ సీపీ గజరావ్ భూపాల్ తెలిపారు. అలాగే ఫింగర్ ప్రింట్స్‌ను క్లోన్ చేయడానికి పాలిమర్ లిక్విడ్, ఏబీ పౌడర్‌ని ఉపయోగించారన్నారు. నిందితులంతా బీటెక్ చేసిన వారని.. ఈజీ మనీ సంపాదించడానికి ఈ స్కామ్ చేసినట్టు హైదరాబాద్ సీసీఎస్ జాయింట్ సీపీ గజరావ్ భూపాల్ తెలిపారు.
ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో పని చేస్తున్న నరేంద్ర నిందితులకు 2500 మంది ఫింగర్ ప్రింట్స్, ఫోన్ నెంబర్స్, డేటాను ఇచ్చాడని తెలిపారు సైబర్ క్రైమ్ డీసీపీ దార కవిత. ఈ డేటా ఆధారంగా నిందితులు పీఓఎస్ ద్వారా డబ్బులు డ్రా చేశారన్నారు. ఇప్పటివరకు 10 లక్షల మనీ విత్ డ్రా చేశారని చెప్పారు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మనీ విత్ డ్రా చేయాలంటే మర్చెంట్ ఐడీ ఉండాలని.. శ్రీను అనే వ్యక్తికి నిందితులు మర్చెంట్ ఐడీ ఇప్పించి.. అతనికి తెలియకుండా మనీ విత్ డ్రా చేసుకున్నారని పోలీసులు తెలిపారు. బాధితుల్లో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారున్నారని తెలిపారు సైబర్ క్రైమ్ పోలీసులు.