Viral: ఆర్డర్ పెట్టకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. తీరా చూస్తే.. సీన్ సితారయ్యింది.!

ఈ-కామర్స్ యాప్‌లో ఆర్డర్ పెట్టకపోయినా మీ ఇంటికి ఆర్డర్లు వస్తున్నాయా..! అయితే జాగ్రత్త వహించండి.!! ఈ-కామర్స్ ద్వారా ప్రజలను లూటీ చేసేందుకు సైబర్ నేరగాళ్లు రోజుకు ఒక కొత్త ప్లాన్‌తో ముందుకు వస్తుంటారు. వారి బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం.

Viral: ఆర్డర్ పెట్టకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. తీరా చూస్తే.. సీన్ సితారయ్యింది.!
Online Parcel
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Ravi Kiran

Updated on: Nov 21, 2023 | 6:31 PM

ఈ-కామర్స్ యాప్‌లో ఆర్డర్ పెట్టకపోయినా మీ ఇంటికి ఆర్డర్లు వస్తున్నాయా..! అయితే జాగ్రత్త వహించండి.!! ఈ-కామర్స్ ద్వారా ప్రజలను లూటీ చేసేందుకు సైబర్ నేరగాళ్లు రోజుకు ఒక కొత్త ప్లాన్‌తో ముందుకు వస్తుంటారు. వారి బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. లేనిపక్షంలో మీ ఖాతా నుంచి డబ్బు పోతూనే ఉంటుంది. ముఖ్యంగా అమెజాన్‌లో ఆర్డర్ పెట్టకపోయినా.. మీ ఇంటికి ఆర్డర్ వచ్చిందంటే ఎట్టి పరిస్థితిలో ఆర్డర్‌ను స్వీకరించవద్దు. ఆర్డర్ రిసీవ్ చేసుకుంటే తప్పనిసరిగా క్యాష్ అన్-డెలివరీ ఉంటుంది. ఇదంతా కూడా సైబర్ నేరగాళ్లు మీ డబ్బు కోసం వేస్తున్న వల.. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి నేరాల బారినపడి బాధితులు కావద్దు.

ఒకవేళ మీరు ఆర్డర్ పెట్టకపోయినా మీ ఇంటికి ఆర్డర్ వచ్చిందంటే, ఒకటికి రెండుసార్లు అమెజాన్ యాప్‌లోకి వెళ్లి ఆర్డర్స్‌లో చెక్ చేసుకోండి. మీ ఆర్డర్స్‌లో కనుక ఎలాంటి వస్తువు పెట్టక పోయినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్డర్‌ను రిసీవ్ చేసుకోవద్దు. ఇలాంటి కొత్త ప్లాన్‌లతో సైబర్ నేరగాళ్లు వేస్తున్న ఎత్తుగడ ఇది. ఎలాంటి ఆర్డర్ మనం పెట్టకపోయినా, నేరుగా ఇంటికి డెలివరీ ప్యాకేజ్‌ను తీసుకొచ్చి క్యాష్ ఆన్-డెలివరీ ద్వారా నగదు చెల్లించమని అడుగుతారు. కొంతమంది తెలిసి తెలియక ఆర్డర్ పెట్టి ఉంటామేమోనని చెలింపులు చేస్తున్నారు. దీంతో బాధితులు నిండా మునిగిపోతున్నారు.

ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని అమెజాన్ ఇండియా ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆర్డర్ పెట్టని వస్తువులను అమెజాన్ డెలివరీ చేయదని స్పష్టం చేసింది. ఆర్డర్ రిసీవ్ చేసుకునే ముందు అమెజాన్ వెబ్‌సైట్‌లో ఆర్డర్స్ హిస్టరీని పరిశీలించాలని స్పష్టం చేసింది. అమెజాన్ ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీ-గిఫ్ట్, కానీ గిఫ్ట్-కార్డులు కానీ ఇవ్వదని సంస్థ ప్రకటించింది.

అమెజాన్ ఫ్రాడ్ బారిన పడకుండా ఉండాలంటే..

– కస్టమర్ సర్వీస్ లేదా టెక్నికల్ సపోర్ట్ కోసం అమెజాన్ వెబ్‌సైట్‌లో మాత్రమే వెతకండి

– ఆర్డర్ డెలివరీ ఆర్జెన్సీపై జాగ్రత్త వహించండి

– Amazon.in వెబ్‌సైట్‌ లింకులను మాత్రమే నమ్మండి

– మీరు ఆర్డర్ పెట్టకపోయినా డెలివరీ వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆర్డర్‌ను స్వీకరించవద్దు

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే