Gannavaram Airport: 2016లో పరిహారం ఇవ్వకుండానే భూములు ఖాళీ చేయించిన టీడీపీ.. వచ్చే నెలలోనే నష్ట పరిహారం ఇద్దామన్న సీఎం జగన్

వాస్తవంగా గత ప్రభుత్వం లోనే పరిహారం అందించాల్సి ఉందని..కానీ పట్టించుకోలేదని సీఎం జగన్ కు వివరించారు వంశీ...నిర్వాసితులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు తెలిసింది..వచ్చే నెలలోనే పరిహారం కింద 44 కోట్లు చెల్లిద్దామని వంశీకి హామీ ఇచ్చారు జగన్..

Gannavaram Airport: 2016లో పరిహారం ఇవ్వకుండానే భూములు ఖాళీ చేయించిన టీడీపీ.. వచ్చే నెలలోనే నష్ట పరిహారం ఇద్దామన్న సీఎం జగన్
Cm Jagan On Gannavaram Airport
Follow us
Surya Kala

|

Updated on: Apr 29, 2023 | 7:02 AM

గన్నవరం ఎయిర్ పోర్ట్ నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే నెలలోనే 44 కోట్లు క్లియర్ చేస్తానని హామీ ఇచ్చారు. సుమారు ఏడేళ్లుగా పరిహారం కోసం ఫైట్ చేస్తున్న వారికి ముఖ్యమంత్రి నిర్ణయం ఊరట కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత గన్నవరం ఎయిర్‌ పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మారింది. రన్ వే విస్తరణ కోసం 2016 లో అప్పటి టీడీపీ ప్రభుత్వం భూములను సేకరించింది. ఎయిర్‌పోర్ట్‌ చుట్టుపక్కల 5 గ్రామాలకు చెందిన 662 మంది రైతులు సుమారు 800 ఎకరాల భూములు ప్రభుత్వానికి అప్పగించారు. కొంతమంది భూములతో పాటు ఇళ్లు కూడా కోల్పోయారు. అప్పట్లో ఎమ్మెల్యే గా వంశీ హామీ ఇవ్వడంతో భూములను ప్రభుత్వానికి అప్పగించారు. అయితే ఏడేళ్లయినా ఇప్పటికీ పరిహారం అందక పోవడంతో ధర్నాలు చేయడంతో పాటు కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు..

ఇదే అంశంపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు..వాస్తవంగా గత ప్రభుత్వం లోనే పరిహారం అందించాల్సి ఉందని..కానీ పట్టించుకోలేదని సీఎం జగన్ కు వివరించారు వంశీ…నిర్వాసితులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు తెలిసింది..వచ్చే నెలలోనే పరిహారం కింద 44 కోట్లు చెల్లిద్దామని వంశీకి హామీ ఇచ్చారు జగన్..

ఇప్పటికే నిర్వాసితుల వివరాలు, అందించాల్సిన పరిహారం పై లెక్కలు సిద్ధం చేశారు అధికారులు. దీనికి అనుగుణంగా నిధులు విడుదల చేసేందుకు సీఎం జగన్ పూర్తి హామీ ఇచ్చినట్లు తెలిసింది. 2016లో చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండానే ఖాళీ చేయించిందట. ఇప్పుడు వారికి వచ్చే నెల్లోనే నష్ట పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..