Balakrishna: ఓ వైపు వైసీపీ బస్సు యాత్ర.. మరో వైపు బాలయ్య పర్యటన.. హిందూపురంలో పొలిటికల్ హీట్
ఎమ్మెల్యే బాలకృష్ణ పది నెలల సుదీర్ఘకాలం తర్వాత హిందూపురం పర్యటన ఖరారైంది. సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్న బాలయ్య పది నెలలుగా నియోజకవర్గానికి రాలేదు. బాలకృష్ణ రాకపోవడంతో టీడీపీ కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొన్న తరుణంలో... ఎట్టకేలకు ఆయన పర్యటన ఖరారైంది. ఎమ్మెల్యే నియోజకవర్గానికి వస్తున్నారన్న సమాచారంతో టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎమ్మెల్యే బాలకృష్ణ పది నెలల సుదీర్ఘకాలం తర్వాత హిందూపురం పర్యటన ఖరారైంది. సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్న బాలయ్య పది నెలలుగా నియోజకవర్గానికి రాలేదు. బాలకృష్ణ రాకపోవడంతో టీడీపీ కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొన్న తరుణంలో… ఎట్టకేలకు ఆయన పర్యటన ఖరారైంది. ఎమ్మెల్యే నియోజకవర్గానికి వస్తున్నారన్న సమాచారంతో టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హిందూపురం టీడీపీ మండల కన్వీనర్ అశ్వత్ రెడ్డి కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు హాజరవుతారు. అదే విధంగా జనసేన, టిడిపి సమన్వయ సమావేశంలో పాల్గొని రెండు పార్టీల నేతలతో బాలకృష్ణ మాట్లాడుతారు. గత పదేళ్ల కాలంలో బాలకృష్ణ పర్యటనల్లో ఇంత గ్యాప్ ఎప్పుడూ రాలేదు. ఆయన రాకపోవడంతో వైసీపీ నేతలు బాలయ్య సినిమాలకే పరిమితమయ్యాడు. హిందూపురం నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్న విమర్శలు సైతం చేశారు. మరో అడుగు ముందుకేసి బాలకృష్ణ ఇక్కడ నుండి పోటీ చేస్తే గెలవలేరన్న విమర్శలూ చేశారు. వీటన్నిటికి పుల్ స్టాప్ పెడుతూ బాలకృష్ణ హిందూపురం వస్తున్నారు. బాలయ్య పర్యటనతో టీడీపీ కార్యకర్తల్లో జోష్ కనిపిస్తుంది.
మరోవైపు రేపు హిందూపురంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర చేపట్టింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ వైపు వైసీపీ బస్సు యాత్ర..మరో వైపు బాలయ్య పర్యటన..హిందూపురం రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. మరోవైపు.. ఈనెల 15వ తేదీ నుంచి రెండో విడత బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 15 రోజుల పాటు అంటే ఈనెల 30వ తేదీ వరకు యాత్ర కొనసాగుతుంది. రెండో దశలో సుమారు 40 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర పూర్తి చేయనున్నారు.
పది నెలల తర్వాత హిందూపురంలో..
దీపకాంతుల జ్యోతులతో, సిరిసంపదల రాశులతో, పటాకుల వెలుగులతో ఆనందంగా చేసుకునే దీపావళి పండుగ మీ ఇంట్లో మరిన్ని వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ.!
మీకు, మీ కుటుంబ సభ్యులకు నరకచతుర్దశి మరియు దీపావళి శుభాకాంక్షలు 🪔🎇#HappyDiwali #Diwali2023 pic.twitter.com/NJPs5TFnp9
— Nandamuri Balakrishna (@NBK_Unofficial) November 12, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



