AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP VS YSRCP: నేను మళ్లీ పోటీ చేస్తే ఆయన పరిస్థితి అంతే సంగతి.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్..

TDP VS YSRCP: టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు పై గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

TDP VS YSRCP: నేను మళ్లీ పోటీ చేస్తే ఆయన పరిస్థితి అంతే సంగతి.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్..
Shiva Prajapati
|

Updated on: Jan 02, 2021 | 4:09 PM

Share

TDP VS YSRCP: టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు పై గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ‘నేను ఒకసారి పోటీ చేస్తేనే ఆయనకు చుక్కలు కనిపించాయి.. మళ్లీ పోటీ చేస్తే రాజకీయాల నుండి తప్పుకుని పారిపోయే పరిస్థితి యరపతినేనిది’ అంటూ ఎద్దేవా చేశారు. శనివారం నాడు పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.. యరపతినేని శ్రీనివాస రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. గడ్డి తినడానికి తామేమీ చిల్లర వ్యక్తులం కాదని వ్యాఖ్యానించారు. యరపతినేని దోచుకుంది ఇక్కడ.. వెళ్లి కూర్చుంది మాత్రం గుంటూరులో అంటూ విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో.. మహేష్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరు అంటూ యరపతినేని చేసిన కామెంట్స్‌‌పై ఆయన తీవ్రంగా స్పందించారు. తాను పోటీ చేస్తే యరపతినేనికి భయమేస్తుందేమో అని ఎద్దేవా చేశారు. తన కుటుంబం తర తరాల నుంచి ప్రజల కోసం పని చేస్తోందని, నీతిగా బ్రతికా.. మచ్చలేకుండా రాజకీయాలు చేస్తున్నామని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పేర్కొన్నారు.

Also read:

Online Loan App: రెచ్చిపోయిన ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకులు.. బంధువులకు మేసేజ్‌లు.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య..

Nara Lokesh Challenge: ఆయనకు సవాల్ చేస్తే విజయసాయి స్పందించడం ఏంటి?.. లోకేష్ మరో సవాల్..!