Nellore: కాళ్లకు రాళ్లు కట్టి కాల్వలో పడేశారు.. ఈ పని చేసింది ఎవరో తెలిస్తే మీ రక్తం మరుగుద్ది
నెల్లూరులో పాప మర్డర్ మిస్టరీ వీడింది. ఎంత కఠినాత్ములైతే పాప కాళ్లకు రాళ్లు కట్టి.. కాలవలో పడేస్తారు చెప్పండి. ఇంతటి దారుణమైన పని చేసింది ఎవరో తెలిస్తే మీకు పట్టరాని కోపం వస్తుంది. కడుపు తరుక్కుపోతుంది. కేసు పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి.
మాతృత్వం ఓ వరం.. ప్రాణం పోయడమే కాదు బిడ్డ కోసం తన ప్రాణాలను సైతం పనంగా పెట్టడానికి వెనుకాడని అమ్మే..ప్రత్యక్ష దైవం. ఎడబాటైన బిడ్డ యాదిలో ప్రాణంలేని బొమ్మకు ఊయలూపి ..లాలిపాడే ..పిచ్చి ప్రేమ ..అమ్మ. అదీ బిడ్డపై అమ్మకు ఉండే పిచ్చిప్రేమ. బిడ్డ కాసేపు కన్పించకపోతేనే అమ్మ గుండె తల్లడిల్లుతుంది. బూచాళ్లు అంటు కథలు చెప్పి బువ్వ తిన్పించే అమ్మ..చిన్నారి కన్పించకపోతే ఏ బూచాళ్లు తన బిడ్డను ఎత్తుకెళ్లారోనని భయపడుతుంది. నెల్లూరులో అదే జరిగింది. రాత్రి ఈ ఊయలలోనే హారికను నిద్దురపుచ్చింది అమ్మ. అర్ధరాత్రి లేచి చూస్తే హారిక బొమ్మలా హాయిగా నిద్దురోయి కన్పించింది. కానీ తెల్లారేసరికి బొమ్మలే ఉన్నాయి. ఊయ్యాలలో హారిక లేదు.
హారిక..ఏడాదిన్నర పసిబిడ్డ. నెల్లూరు గుర్రాల మడుగు ఏరియాలో ఉంటోన్న అనూష- మణికంఠ దంపతుల గారాలబిడ్డ. వృత్తిరీత్యా మణికంఠ హాటల్ నిర్వహిస్తుంటాడు. అనూష కాలేజీకి వెళ్తూ మరో కుటుంబపోషణ కోసం పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తుంది. ముద్దులొలికే హారిక అంటే కన్నవాళ్లకే కాదు చుట్టుపక్కల వాళ్లకు ఎంతో ప్రేమ. హారిక కన్పించడంలేదని తెలిసి అంతా నివ్వెరపోయారు. అనూష ఫిర్యాదు పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాప్ కోణంలో ఎంక్వయిరీ చేపట్టారు.
ఈ ఏరియాలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఐనా అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి పాపను ఎత్తుకెళ్లేంత సాహసం ఎవరు చేస్తారు? తెలిసినవాళ్ల పనా? లేక మరేదైనా కోణం వుందా? ఆరా తీస్తున్న క్రమంలో సర్వేపల్లి కాలనీలో చిన్నారి హారిక డెడ్‌బాడీ దొరికింది. సీన్ చూసి స్థానికులే కాదు పోలీసులు షాకయ్యారు.ముక్కుపచ్చలారని చిన్నారి కాళ్లకు రాళ్లు కట్టి కాలువలో పడేశారంటే.. అంత రాతిగుండె ఎవరిది? ..ఈ ప్రశ్నకు జవాబు దొరకడానికి ఎంతో టైమ్ పట్టలేదు.
అమ్మే బిడ్డను అంతం చేసింది. తన కెరీర్‌కు బిడ్డ అడ్డుగా ఉందనే.. హతమార్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బిడ్డను చంపి కిడ్నాప్ డ్రామాకు తెరలేపింది ఈ టక్కులాడి. మాతృత్వానికే మాయని మచ్చ ఇది. స్థానికులు దుమ్మెత్తిపోశారు. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బిడ్డకు చిన్న గాయం ఐతేనే అమ్మగుండె తల్లడిల్లుతుంది.అలాంటి పసిగుడ్డు అనేకనికరం లేకుండా కాళ్లకు రాళ్లు కట్టి కాల్వలో విసిరేయడానికి మనసేలా వచ్చింది. కర్ణుడిలా ఎక్కడో వదిలేసినా బావుండేదేమో కానీ కాళ్లకు రాళ్లకు కట్టి కాల్వలో విసిరేసింది. ఆ బిడ్డకు మాటలొచ్చవుంటే ఆ పసిహృదయ వేదన ఎలా వుండి వుంటుందో ఊహిస్తే గుండెచెరువవడం ఖాయం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.