Buggana Rajendranath: నాడు-నేడుపై ప్రతిపక్షాలు చెబుతున్నవన్నీ అబద్ధాలే.. టీడీపీ నేత యనమలపై మంత్రి బుగ్గన ఫైర్..
నాడు-నేడు.. వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోన్న పథకాల్లో ఒకటి. స్కూల్స్, హాస్పిటల్స్.. ఇలా అనేక రంగాల్లో నాడు-నేడు పేరుతో విప్లవాత్మక సంస్కరణలు, అభివృద్ధి పనులు చేపట్టింది జగన్ సర్కార్.

నాడు-నేడు.. వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోన్న పథకాల్లో ఒకటి. స్కూల్స్, హాస్పిటల్స్.. ఇలా అనేక రంగాల్లో నాడు-నేడు పేరుతో విప్లవాత్మక సంస్కరణలు, అభివృద్ధి పనులు చేపట్టింది జగన్ సర్కార్. అయితే, అదే నాడు-నేడు పేరుతో వైసీపీ సర్కార్‌ను టార్గెట్ చేశారు టీడీపీ లీడర్ యనమల రామకృష్ణుడు. సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాసిన యనమల, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో నాడు మూడో స్థానంలో ఉంటే, ఇప్పుడు 13వ ప్లేస్‌కి పడిపోయిందంటూ విమర్శించారు. అయితే, యనమల ఆరోపణలను తిప్పికొట్టారు ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. హైదరాబాద్‌లోనో, విజయవాడలోనో కూర్చుంటే ఏం తెలుస్తుంది.. అంటూ యనమలపై ఫైర్ అయ్యారు. క్షేత్రస్థాయిలో పర్యటించండి… కనీసం మీ తునికి అయినా రండి.. అంటూ యనమల రామకృష్ణుడికి ఆర్థిక మంత్రి బుగ్గన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
టీడీపీ నేత యనమల మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేదన్నారు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి. ఎక్కడో కూర్చొని అవాస్తవాలు మాట్లాడొద్దని సూచించారు. నాడు-నేడుతో ఎంత అభివృద్ధి జరిగిందో తెలియాలంటే గ్రామాల్లో పర్యటించాలని బుగ్గన కోరారు. ప్రతిపక్షాలు చెబుతున్నవన్నీ అబద్దాలేనంటూ విమర్శించారు. అభివృద్ధి జరిగినా.. అన్యాయంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
గత ప్రభుత్వం శంకుస్తాపనలకే పరిమితమైందనే.. తామే వాటిని పూర్తిచేశామని రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఎక్కడ కూడా పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు ఎత్తివేయలేదంటూ ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. కొత్తగా పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బుగ్గన ఇంకా ఏం మాట్లాడారో ఈ కింద ఇచ్చిన వీడియోలో చూడండి..




మరిన్ని ఏపీ వార్తల కోసం..
