Minister Roja: పవన్, చంద్రబాబులపై మంత్రి రోజా ధ్వజం.. ప్రజలకు ఏం చేశారని స్టిక్కర్లు వేస్తున్నారంటూ ..
ఏపీ పర్యాటక శాఖా మంత్రి రోజా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై భగ్గుమన్నారు. చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్‌లపై తనదైన సెటైర్లు వేశారు. అవి సెల్ఫీ చాలెంజ్‌లు కాదని చంద్రబాబు వేసుకుంటున్న సెల్ఫ్ గోల్స్ అని దుయ్యబట్టారు. శనివారం మీడియాతో మాట్లాడిన రోజా..
ఏపీ పర్యాటక శాఖా మంత్రి రోజా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై భగ్గుమన్నారు. చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్‌లపై తనదైన సెటైర్లు వేశారు. అవి సెల్ఫీ చాలెంజ్‌లు కాదని చంద్రబాబు వేసుకుంటున్న సెల్ఫ్ గోల్స్ అని దుయ్యబట్టారు. శనివారం మీడియాతో మాట్లాడిన రోజా చంద్రబాబు అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లపై విమర్శలు చేశారు. ‘ప్రజల ఇంటికి వలంటీర్ వెళ్లి సంక్షేమం ఇచ్చే పరిస్థితి ఎక్కడైనా ఉందా? ప్రతి ఇంటికి ఎమ్మెల్యే, మంత్రులు వెళుతున్నారు. వలంటీర్ వ్యవస్థ ఒక సైనిక వ్యవస్థలాగా ఏపీ ప్రజలకు అండగా నిలుస్తోంది. అందుకే ప్రజలందరూ మా నమ్మకం నువ్వే జగన్ అంటున్నారు. ఇంట్లో ఎవరూ చూస్కోకపోయినా జగన్ ఉన్నాడనే నమ్మకంతో చాలామంది ఉన్నారు. మెగా పీపుల్స్ సర్వే ఒక అద్భుతమైన కార్యక్రమం. జగన్‌కు మద్దతిచ్చేందుకు అందరూ తమ వివరాలు ఇస్తున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇదొక సంచలన కార్యక్రమం. పవన్ అయినా చంద్రబాబు అయినా ప్రజలకు ఏం చేశారో చెప్పి ఇంటికి స్టిక్కర్లు వేయాలి’
‘మేమేం చేస్తున్నారో టీడీపీ, జనసేన నేతలు ప్రజల్ని అడిగి తెలుసుకొండి. చంద్రబాబు టిడ్కో ఇళ్ల దగ్గర తీసుకుంటున్నవి సెల్ఫీలు కాదు సెల్ఫ గోల్స్. చంద్రబాబు ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్. మ్యానిఫెస్టోలో ఏం చెప్పావో, అధికారంలో ఏం చేశావో చర్చించేందుకు సిద్ధం. దమ్ముంటే రా’ అని సవాల్ విసిరారు రోజా.
మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..