AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: సుప్రీంకోర్టు రెండు కీలక తీర్పులు.. ఇద్దరు ఏపీ మహిళా మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక ఘట్టం చోటు చేసుకుంది. అమరావతి, వివేకా హత్య కేసు విషయాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు.. ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై..

Andhra Pradesh: సుప్రీంకోర్టు రెండు కీలక తీర్పులు.. ఇద్దరు ఏపీ మహిళా మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు..
Ministers Roja, Taneti Vani
Ganesh Mudavath
|

Updated on: Nov 29, 2022 | 3:17 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక ఘట్టం చోటు చేసుకుంది. అమరావతి, వివేకా హత్య కేసు విషయాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు.. ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై పలువురు రాజకీయ ప్రముఖులు, మంత్రులు స్పందించారు. అమరావతి రాజధాని విషంపై సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తర్వాతైనా అడ్డమైన యాత్రలు మానేయాలని మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బినామీలతో కట్టుకున్న కోట బద్దలు అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాల మేరకు సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆమె.. ఇవి ఆయన సొంత నిర్ణయాలు కాదన్నారు. 175 కు 175 సీట్లు వైసీపీ నే తెచ్చుకుంటే తాము ఏం చేయాలో పవన్ కల్యాణ్ చెబుతున్నారన్న రోజా..2019 లో రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఏం చేశారో అదే చేయాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ ఇద్దరినీ చూసి జనం తలలు పట్టుకుంటున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోదని మంత్రి రోజా జోస్యం చెప్పారు.

వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ హైదరాబాద్‌కు బదిలీ అయింది. కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకా కూతురు సునీత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు చెప్పింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఆధారాలను మాయం చేశారన్న ఆరోపణలపై సీబీఐ విచారణ చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఈ తీర్పుపై హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. వైఎస్. వివేకా హత్య టీడీపీ హయాంలో జరిగిందన్న ఆమె.. తెలుగు దేశం ప్రభుత్వమే దర్యాప్తులో విఫలమైందని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో ఎవరినీ బెదిరించడం లేదన్న మంత్రి.. ప్రతిపక్షాలు, ప్రతిపక్షాల హోదా లేని వారే రాష్ట్రంలో ఆందోళన కోసం ప్రయత్నిస్తున్నారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మరోవైపు.. రాజధాని విషయంలో తమ స్టాండ్ కు తగ్గట్టే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వం రాజధాని అంశంలో ఒక నిర్ణయం తీసుకుందని, సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు చేసిందని చెప్పారు. రైతులకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్న ఆయన.. రాజధాని అంశం ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఒప్పందం కాదన్నారు. మూడు రాజధానులతో వికేంద్రీకరణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వైఎస్ వివేకా.. ముఖ్యమంత్రి జగన్ కు చిన్నాన్న అని, ఈ కేసులో రాజకీయాలు ఉండవని తెలిపారు. తెలంగాణలో విచారణ జరిగితే ఇంకా మంచిదన్న సజ్జల.. ఎలాంటి భయాలు, దాపరికాలు లేవని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ న్యూస్ కోసం