Andhra Pradesh: లొట్టలేసుకుంటూ చికెన్ తింటున్నారా? అయితే ముందు ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే ఇక మీ ఇష్టం..

ప్రజల ఆరోగ్యంతో చికెన్ మాఫియా చెలగాటమాడుతోంది.. ఎన్ని తినిఖీలు జరిగినా వారిలో కాసుల కక్కుర్తి మాత్రం పోవడం లేదు.. ఇటీవల నెల్లూరు జిల్లాలోని

Andhra Pradesh: లొట్టలేసుకుంటూ చికెన్ తింటున్నారా? అయితే ముందు ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే ఇక మీ ఇష్టం..
Chicken
Follow us

|

Updated on: Nov 29, 2022 | 3:47 PM

ప్రజల ఆరోగ్యంతో చికెన్ మాఫియా చెలగాటమాడుతోంది.. ఎన్ని తినిఖీలు జరిగినా వారిలో కాసుల కక్కుర్తి మాత్రం పోవడం లేదు.. ఇటీవల నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో చికెన్ మాఫియా అగాడాలపై అధికారులు తనిఖీలు చేపట్టినా మళ్లీ అదే తీరు ప్రదర్శిస్తున్నారు. తాజాగా నెల్లూరు లోని వెంకటేశ్వర పురం లోని బిస్మిలా చికెన్ స్టాల్ పై ఫిర్యాదులు రావడంతో హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ నేతృత్వంలో దాడులు నిర్వహించారు. చికెన్ మాఫియాపై అధికారుల కొరఢా ఝుళిపించారు. నెల్లూరు టౌన్‌లోని పలు చికెన్ స్టాల్స్‌లో తనిఖీలు చేశారు.

దాదాపు 100 కిలోలకు పైగా కుళ్ళిన, నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు అధికారులు. పాడైపోయిన, నిల్వ ఉంచిన చికెన్‌ను విక్రయిస్తున్న షాపులను సీజ్ చేశారు అధికారులు. శుభ్రత పాటించని మరికొందరికి వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో ప్రజలకు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు అధికారులు. చికెన్ కొనుగోలు చేసే ముందు పరిశీలించాలని ప్రజలకు సూచించారు అధికారులు. ఇలాంటి కుళ్లిన, పాడైపోయిన, నిల్వ ఉంచిన చికెన్ తినడం వలన ఆరోగ్యం దెబ్బతింటుందని, చికెన్ కొనుగోలు చేసే ముందు అప్రమత్తంగా ఉండాలని హితవుచెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..