Cobra: ఇంట్లోకి చొరబడిన పాము.. ఆ కుటంబమంతా కలిసి ఏం చేశారో తెలిస్తే షాకే..

Cobra: ఇంట్లోకి పాము చొరబడితే ఎవరైనా భయపడటం చూశాం.. కొందరు ధైర్యం చేసి దానిని కర్రతో కొట్టడి చంపడం చూశాం.. ఇంకొందరు జాలి గల వారైతే..

Cobra: ఇంట్లోకి చొరబడిన పాము.. ఆ కుటంబమంతా కలిసి ఏం చేశారో తెలిస్తే షాకే..
Snake
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 29, 2022 | 4:17 PM

ఇంట్లోకి పాము చొరబడితే ఎవరైనా భయపడటం చూశాం.. కొందరు ధైర్యం చేసి దానిని కర్రతో కొట్టడి చంపడం చూశాం.. ఇంకొందరు జాలి గల వారైతే.. స్నేక్ క్యాచర్స్‌కి కాల్ చేసి సేఫ్‌గా దానిని పట్టించిన వారినీ చూశాం. కానీ, ఈ కుటుంబ సభ్యులు ఏం చేశారో తెలిస్తే అవాక్కవుతారు. అవును, ఓ ఇంట్లోకి తాచుపాము దూరగా.. దానికి భక్తి ప్రపత్తులతో పూజలు చేశారు కుటుంబ సభ్యులు. పామును కర్రతో అదిమిపట్టి.. పాలు, పసుపు, కుంకుమ చల్లి పూజలు చేశారు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అమలాపురంలోని విత్తనాల వారి కాలువ గట్టు వద్ద ఉన్న ఓ ఇంట్లోకి గోధుమ రంగులో ఉన్న తాచుపాము చొరబడింది. అయితే, ఆ పామును గమనించిన ఇంటి సభ్యలు ఏమాత్రం భయపడకపోగా.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చాడంటూ మురిసిపోయారు. భక్తిపారవశ్యంలో మునిగితేలారు. షష్టి రోజున పాము ఇంట్లోకి రావడంతో దేవుడే తమ ఇంట్లోకి వచ్చాడని భావించిన ఆ ఇంటి మహిళలు.. ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.

ముందు స్నేక్ క్యాచర్‌ గణేష్ వర్మకు ఆ సమాచారం అందించగా.. అతని వచ్చి పామును పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతను పామును కర్రతో అధిమి పట్టగా.. ఇంటి మహిళలు పాలు పోసి, కుంకుమ, పసుపు చల్లి పూజలు నిర్వహించారు. పాముకు దండం పెట్టారు. అనంతరం స్నేక్ క్యాచర్ ఆ పామును ఒక డబ్బాలో బంధించాడు. గ్రామానికి దూరంగా అడవీ ప్రాంతంలో విడిపెట్టాడు.

ఇవి కూడా చదవండి

పాముకు పూజలు చేస్తున్న వీడియో..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..