AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి నియామకం.. ఆ అధికారులకు..

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్. జవహార్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Andhra Pradesh: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి నియామకం.. ఆ అధికారులకు..
Jawahar Reddy
Shaik Madar Saheb
|

Updated on: Nov 29, 2022 | 5:59 PM

Share

KS Jawahar Reddy: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్. జవహార్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన డిసెంబర్ 1వ తేదీ నుంచే బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ సీఎస్‌గా ఉన్న సమీర్‌ శర్మ పదవీ కాలం రేపటితో ముగియనుంది. సమీర్ శర్మ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో 1990 క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి జవహర్ రెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి స్పెషల్ సీఎస్ గా ఉన్న జవహర్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా ప్రొమోట్ అయ్యారు. 2024 జూన్‌ వరకు ఆయనకు సర్వీసు ఉండటంతో అప్పటివరకు ఆయన కొనసాగనున్నారు.

సీనియర్ అధికారులున్నా.. జగన్ ప్రభుత్వం జవహర్‌రెడ్డి వైపు మొగ్గుచూపింది. జవహర్ రెడ్డి కంటే ముందు.. నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ (1987), పూనం మాలకొండయ్య (1988), కరికాల్‌ వలెవన్‌ (1989) సీఎస్‌ పోస్టును ఆశించారు. కానీ చివరకు సీఎం జగన్‌ మాత్రం జవహర్‌రెడ్డి వైపే మొగ్గు చూపారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జవహర్‌రెడ్డికి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు.

దీంతోపాటు పలువురు ఐఏఎస్ అధికారులను కూడా వేరే శాఖలకు బదిలీ చేస్తూ  ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం స్పెషల్ సీఎస్‌గా పూనమ్ మాలకొండయ్యను నియమించింది. అంతేకాకుండా పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రవీణ్ ప్రకాష్ నియమించింది. వ్యవసాయశాఖ స్పెషల్‌ CSగా మధుసూదన్‌రెడ్డి, ఆర్‌ అండ్‌ బీ సెక్రటరీగా ప్రద్యుమ్న,  వ్యవసాయశాఖ కమిషనర్‌గా రాహుల్‌ పాండే, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ దివాన్ ను నియమించింది.

ఇవి కూడా చదవండి

సీనియర్ ఐఎఎస్ అధికారి బి. రాజశేఖర్ ను జీఎడికి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం జీవోను జారీ చేసింది. ఇదిలాఉంటే.. సీఎస్‌గా పదవీవిరమణ అనంతరం సమీర్‌శర్మను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా ప్రభుత్వం నియమించనుందని సమాచారం..

మరిన్ని ఏపీ వార్తల కోసం..