AP News: ఇకపై ఏపీలో ఇసుక ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ.. కానీ అలా చేస్తే పీడీ యాక్ట్

ఉచిత ఇసుక విధానంపై ఏపీ కేబినెట్‌ కీలక ప్రకటన చేసింది. సొంత అవసరాలకు ఎంత ఇసుకైనా ఉచితంగా వాడుకోవచ్చని వెల్లడించింది. అయితే.. కమర్షియల్‌గా వినియోగిస్తే పీడీ యాక్ట్‌లు తప్పవని హెచ్చరిస్తోంది.

AP News: ఇకపై ఏపీలో ఇసుక ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ.. కానీ అలా చేస్తే పీడీ యాక్ట్
Free Sand in Andhra
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 24, 2024 | 8:36 AM

ఏపీ ప్రజలకు బిగ్‌ అలెర్ట్‌… ఇసుక పాలసీపై సంచలన నిర్ణయం తీసుకుంది సర్కార్.  ఏపీలో ఇకపై ఇసుక ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ. సొంత అవసరాలకు ఎంతైనా వాడుకోవచ్చు… లిమిట్‌ క్రాస్‌ చేస్తే మాత్రం చర్యలు తప్పవ్‌… అంటోంది ఏపీ కేబినెట్‌. అవును… ఉచిత ఇసుక విషయంలో ఏపీ కేబినెట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. సీనరేజ్, జీఎస్టీ చార్జీల రద్దుకు ఆమోదం తెలిపింది. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇసుక లేని జిల్లాల్లో మినరల్‌ డీలర్లను పెట్టి ధరల నియంత్రణ చేపట్టాలని నిర్ణయించింది. ఇసుక విధానంలో తమ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్తోందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులతోనే NGT పెనాల్టీలు వేసిందని చెప్పారు. ఇసుక ఎవరికి వారు సొంతంగా లోడ్ చేసుకోవచ్చని, అయితే.. సొంత అవసరాలకే వాడుకోవాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా అక్రమ రవాణా చేస్తే పీడీ యాక్ట్‌ పెడతామని హెచ్చరించారు కొల్లు రవీంద్ర.

మొత్తంగా.. ఏపీ కేబినెట్‌ నిర్ణయంతో ఇకపై ఇసుక ఉచితంగా దొరకనుంది. ఇప్పటికే.. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలో ఇసుక ఉచితంగా తీసుకేళ్లేందుకు అనుమతి ఇచ్చింది. తాజాగా.. సొంత అవసరాలకు ఎంతైనా వాడుకోవచ్చని కేబినెట్‌లో తీర్మానించడంపై హర్షం వ్యక్తమవుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..