AP News: శారదాపీఠానికి గత ప్రభుత్వ భూకేటాయింపులు రద్దు.. ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులేంటి..?
శాఖ శారదాపీఠానికి గత ప్రభుత్వ భూకేటాయింపులను రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. అసలీ నిర్ణయానికి కారణాలేంటి...? ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులేంటి..?
గత ప్రభుత్వం విశాఖలోని శారదాపీఠానికి కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని ఏపీ కేబినెట్ నిర్ణయించడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇష్యూపై రకరకాల వాదనలూ ఊపందుకున్నాయి. విశాఖ జిల్లా భీమిలి పట్టణం సమీపంలోని కొత్తవలస గ్రామంలో ఉన్న 15 ఎకరాల భూమిని జగన్ ప్రభుత్వం శారదా పీఠానికి కేటాయించింది. ఒక ఎకరా భూమికి కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే తీసుకుని… ఆ భూమిని శారదా పీఠానికి ఇచ్చేసింది. అంటే మొత్తం 15 లక్షల రూపాయలకే 15 ఎకరాలను పిఠానికి గత ప్రభుత్వం అప్పగించింది. దీంతో అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పలువురు టీడీపీ నేతలు ఈ ఇష్యూపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా చేశారు. భీమిలి సమీపంలో ఎకరా భూమి 15 కోట్లకు పైగా ఉందని ఇటు అధికారులు కూడా చెబుతున్నారు.
ఇక అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం… విశాఖ శారదా పీఠానికి సంబంధించిన భూములపై దృష్టి సారించింది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం అధికారులతో భూములపై విచారణ జరిపించింది. అమ్మకాలు, కొనుగోళ్ల లెక్కలన్నీ బయటకు తీశారు. కోట్లు విలువ చేసే 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇక మంత్రివర్గంలోనూ భూముల రద్దుకు గ్రీన్ సిగ్నల్ దొరికింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..