AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఆ తలుపు గడియ వేసి ఉంది.. కూతురికి అనుమానమొచ్చి కిటికీలో తొంగి చూడగా

అనంతరం తన పిల్లలతో సారధి రోడ్‌లోనే వేరొక ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడే ఉండటం ప్రారంభించింది. అనంతరం తన జీవనోపాధి కోసం స్థానికంగా ఉన్న ఓ వస్త్రదుకాణంలో ఉద్యోగానికి జాయిన్ అయింది. భర్తకు దూరమైన సావిత్రి ఏదో ఒక విధంగా మన్మధ కుమార్ సహాయంతో తన పిల్లలతో జీవనాన్ని ముందుకు సాగించాలని అనుకుంది.

Andhra: ఆ తలుపు గడియ వేసి ఉంది.. కూతురికి అనుమానమొచ్చి కిటికీలో తొంగి చూడగా
Andhra News
Gamidi Koteswara Rao
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 29, 2025 | 1:45 PM

Share

ఓ మోసగాడి ట్రాప్‌లో పడి భర్తను దూరం చేసుకొని పచ్చని కాపురంలో చిచ్చు రేపుకుంది. నయవంచకుడి మాటలు నమ్మి భర్తతో పాటు కుటుంబాన్ని దూరం చేసుకుంది. చివరికి ఒంటరిగా మిగిలి మోసగాడి వేధింపులు తట్టుకోలేక మనస్తాపంతో ప్రాణాలు వదులుకున్న విషాదకర ఘటన అందరినీ కలిచివేస్తుంది. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటన సర్వత్రా సంచలనంగా మారింది. రాజాం పట్టణంలో జరిగిన హృదయవిధారక ఘటన అందరినీ కలిచివేస్తుంది. భామిని మండలం బాలేరు గ్రామానికి చెందిన ఉర్లాపు సావిత్రి(44) కుటుంబంతో కలిసి సాదాసీదా జీవితం గడుపుతూ ఉండేది. పదహారు సంవత్సరాల క్రితం గణపతి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. గణపతి, సావిత్రికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులు ఆ దంపతులను చుట్టుముట్టాయి. ఆ సమయంలోనే భర్తకు వచ్చే డబ్బు చాలకపోవడంతో ఏదో ఒక పని చేసుకొని తాను కూడా భర్తకు అండగా ఉందామని అనుకుంది ఈ క్రమంలోనే తనకు అవసరమైన డబ్బు విషయంలో పాలకొండలో ఫైనాన్స్ వ్యాపారి మన్మథ్‌కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అలా పరిచయం అయిన కొద్ది రోజులకు మరింత క్లోజ్‌గా మారారు. ఆ తరువాత ఆమెకు కావలసిన రుణం ఇచ్చి ఇంకా కావాలంటే కూడా రుణం ఇప్పిస్తానని, జీవితమే మార్చేస్తానని నమ్మించాడు. అలా వారిద్దరి పరిచయం.. ఇద్దరు మధ్య అక్రమ సంబంధానికి దారి తీసింది. కొన్ని రోజుల పాటు వారి మధ్య కొనసాగిన అక్రమ బంధానికి భర్త గణపతి అడ్డుగా ఉండటం గమనించారు. దీంతో మన్మధ కుమార్ మనిద్దరం కలిసి ఉందాం, నిన్ను నీ పిల్లల్ని బాగా చూసుకుంటా మంచి భవిష్యత్తు ఇస్తా! మీ భర్తను వదిలేయ్ అంటూ ఆమెను నమ్మబలికాడు. అలా మన్మధ కుమార్‌పై ఉన్న నమ్మకంతో ముందుకు వచ్చిన సావిత్రి తన భర్త గణపతికి దూరమైంది. అలా వారి దాంపత్య జీవితం కూడా దెబ్బతింది.

అనంతరం తన పిల్లలతో సారధి రోడ్‌లోనే వేరొక ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడే ఉండటం ప్రారంభించింది. అనంతరం తన జీవనోపాధి కోసం స్థానికంగా ఉన్న ఓ వస్త్రదుకాణంలో ఉద్యోగానికి జాయిన్ అయింది. భర్తకు దూరమైన సావిత్రి ఏదో ఒక విధంగా మన్మధ కుమార్ సహాయంతో తన పిల్లలతో జీవనాన్ని ముందుకు సాగించాలని అనుకుంది. అయితే సావిత్రి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఆమెపై అనుమానం పెంచుకోవటం ప్రారంభించాడు. అంతేకాకుండా తన పరిచయంతో కుటుంబసభ్యులు అంతా దూరమై ఏకాకిగా ఉన్న సావిత్రి పరిస్థితి గమనించాడు. అలా తరచూ మన్మథ్‌కుమార్ సావిత్రిని శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆదివారం షాపులో ఉన్న సావిత్రికి ఫోన్ చేసి విచక్షణారహితంగా దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగాడు. దీంతో సావిత్రి వస్త్రదుకాణం నుంచి కన్నీటి పర్యంతంగా ఇంటికి వచ్చింది.

వెంటనే ఇంట్లో ఉన్న కుమార్తెను అమ్మమ్మ ఇంటికి వెళ్లాలని చెప్పి పంపించి ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఆ తరువాత కొంతసేపటికి కుమార్తె అమ్మమ్మ ఇంటి నుండి వచ్చి తలుపు కొడితే ఎంతసేపటికి సావిత్రి తలుపు తీయలేదు. దీంతో కిటికీలో నుండి తొంగి చూడగా తల్లి ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆందోళన చెందింది కుమార్తె. వెంటనే తన అమ్మమ్మకి సమాచారం ఇచ్చింది. హుటాహుటిన బంధువులు సావిత్రి ఇంటికి వచ్చారు. అప్పటికే సావిత్రి మరణించి ఉంది. విషయాన్ని పోలీసులకు తెలియజేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసుల విచారణలో సావిత్రి చివరిగా ఏడుస్తూ ఎవరితో మాట్లాడింది. ఏం మాట్లాడింది? ఎవరు బెదిరించారు? ఆత్మహత్య చేసుకోవలసినంత కష్టం ఎందుకు వచ్చింది అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే చివరగా మాట్లాడిన కాల్ మన్మధ కుమార్ ఫోన్‌గా ప్రాథమికంగా గుర్తించారు. అయితే వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలో భాగంగా నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో? ఎక్కడికి వెళ్తావో వెళ్ళు? నేను తప్ప నీకు ఎవరు లేరు? అన్న మాటలు స్థానికుల చెవిన పడ్డాయి. దీంతో ఆమెను మన్మధకుమార్ బెదిరించినట్లు స్థానికులు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా తమ అవసరాలు తెలుసుకొని మాయమాటలతో నమ్మించి, పచ్చని సంసారంలో చిచ్చుపెట్టే మాయగాళ్లు ఉంటారని, తస్మాత్ జాగ్రత్త మాయమాటలు చెప్పే మాటగాళ్ళ ట్రాప్ లో పడకుండా మహిళలు జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే