Andhra Pradesh: కొత్త జంటలకు నిరాశ.. ఇక ఆ ప్రముఖ క్షేత్రంలో వివాహాలకు బ్రేక్

కడప జిల్లా ఒంటిమిట్ట రాములోరి ఆలయంలో వివాహాలు జరగకుండా వివాహాలకు అనుమతి ఇవ్వొద్దని పురావస్తు శాఖ ఆదేశాలు ఇచ్చినట్చు తెలుస్తుంది. ఇక వివాహాలకు అనుమతులు ఇవ్వరా అంటూ భక్తులు అసహనానికి గురౌతున్నారు ఇందుకు సంబంధించి టీటీడీకి కేంద్ర పురావస్తు శాఖ ఆదేశాలు అందాయని సమాచారం రాములవారి భక్తులను అసంతృప్తికి గురిచేస్తోంది.

Andhra Pradesh: కొత్త జంటలకు నిరాశ.. ఇక ఆ ప్రముఖ క్షేత్రంలో వివాహాలకు బ్రేక్
Marriage
Follow us
Sudhir Chappidi

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 09, 2024 | 9:47 PM

కొత్త జంటలను నిరాశకు గురిచేసే వార్త ఇది. ఏపీలోని ఆ ప్రముఖ ఆలయంలో ఇకపై పెళ్లిళ్లు నిర్వహించేందుకు అనుమతించరు. ఆ మేరకు అధికారులు నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విషయంలోకి వెళ్తే.. ఆంధ్ర భద్రాద్రిగా పేరొందిన ఒంటిమిట్ట కోదండ రామాలయం ఎంతో ప్రాచుర్యం కలిగింది. ఈ ఆలయంలో వివాహాలు చేసుకునేందుకు భక్తులు మక్కువ చూపుతుంటారు. ఇక్కడ వివాహాలు చేసుకుంటే జీవితం ఎంతో సుఖసంతోషాలతో ఉంటుందని భక్తుల విశ్వాసం. స్వామి వారి కటాక్షాన్ని కోరుకుని రాముని ఆలయంలో వివాహాలు చేసుకోవడం జరుగుతూ వస్తోంది. అటువంటి ఆలయంలో వివాహాల నిర్వహణకు అనుమతించొద్దంటూ కేంద్ర పురావస్తు శాఖ ఆదేశాలు జారీ చేయడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కడప జిల్లా ఒంటిమిట్ట రాములోరి ఆలయంలో వివాహాలు జరగకుండా వివాహాలకు అనుమతి ఇవ్వొద్దని పురావస్తు శాఖ ఆదేశాలు ఇచ్చినట్చు తెలుస్తుంది. ఇక వివాహాలకు అనుమతులు ఇవ్వరా అంటూ భక్తులు అసహనానికి గురౌతున్నారు ఇందుకు సంబంధించి టీటీడీకి కేంద్ర పురావస్తు శాఖ ఆదేశాలు అందాయని సమాచారం రాములవారి భక్తులను అసంతృప్తికి గురిచేస్తోంది.

కార్తీక మాసంలో వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ మాసంలో జగదభిరాముని సన్నిధిలో వివాహాలు చేసుకోవడం కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు అయితే వివాహాలకు బ్రేక్ వేస్తూ భారత పురావస్తు శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత పది సంవత్సరాలుగా రాములవారి ఆలయంలో వివాహాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రామాలయంలో రామలింగేశ్వర స్వామి ముంగిట్లో సీతారాముల ఎదుర్కోలు మండపం వద్ద వివాహాలు చేసుకుంటూ ఉంటారు. ముందుగా వధూవరులు తమకు సంబంధించిన గుర్తింపు కార్డులతో ఆలయ అధికారుల వద్దకు వచ్చి తేదీ నిర్ణయించి ఆలయంలో వివాహం చేసుకున్నందుకు అనుమతులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఆలయ అధికారులు దరఖాస్తులను పరిశీలించి వివాహానికి అనుమతులు ఇస్తూ ఉంటారు. స్వామివారి సన్నిధిలో వేదమంత్రాలతో నూతన వధూవరులు ఒకటై జీవిత భాగస్తులుగా ఒక్కటైతే అయితే జీవితాతం కలసిమెలసి అన్యూమ్యంగా ఉంటారని నమ్మకం. అలాంటి ఆనవాయితికి బ్రేక్ వేస్తూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంపై భక్తులు విస్మయ్యం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం వివాహాలు నిలుపుదల చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకోవడంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. దీనిపై టీటీడీ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాలని స్దానిక ప్రజలు , రాములవారి భక్తులు భావిస్తున్నారు.