AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు.. చెప్పినా వినకుండా దాటే ప్రయత్నం.. చూస్తుండగానే..

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. వాగు దాటుతూ ఓ వ్యక్తి నీటిలో కొట్టుకుపోయాడు. అల్ప బడిన ప్రభావంతో రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలపాతాలు ఉదృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో పొలానికి వెళ్తున్న ఒక రైతు వాగును దాటుతుండగా.. ఒక్కసారిగా వరధ ఉధృతి పెరగడంతో అతను వాగులో కొట్టుకుపోయాడు. మాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. కుమారస్వామి గల్లంతుతో.. ఆ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది.

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు.. చెప్పినా వినకుండా దాటే ప్రయత్నం.. చూస్తుండగానే..
Andhra News
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Aug 18, 2025 | 9:18 PM

Share

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్ప బడిన ప్రభావంతో రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు జనజీవనాన్ని స్తంభింపజేసింది. పంట పొలాలు నీట మునిగాయి. పాడేరు జీ.మాడుగుల మధ్య మత్స్య గెడ్డ వరద ఉధృతి పెరిగింది. హుకుంపేట మండలం చీడిపుట్టు వాగు పొంగి 10 గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఉప్ప వద్ద వాగు పొంగిపోవడంతో పది గ్రామాలకు రాకపోకలు అంతరాయం కలిగింది. పెదబయలు మండలం పరాధానపుట్టు మత్స్య గెడ్డ పొంగి యాభై గ్రామాలకు రాకపోకలు  స్తంభించి పోయాయి. నిత్యవసరల కోసం ప్రమాదకర వాగులు తప్పనిసరి పరిస్థితుల్లో దాటుతున్నారు గిరిజనులు. అలాగే.. అరకులోయ ఏజెన్సీ లోనూ చాలా ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైనది. డుంబ్రిగుడ మండలం కించమండ, కితలంగి గ్రామాల మధ్యలో కల కాజ్వేపై పొంగి ప్రవహిస్తుండడంతో.. 20 గ్రామాల ప్రజలకు రాకపోకలు స్తంభించాయి.

వాగు దాటుతుండగా.. పెరిగిన వరధ ఉధృతి

అల్లూరి జిల్లా పాడేరు మండలం దిగుమోదాపుట్టులో వాగు ఉదృతి పెరిగింది. వంతెన పైనుంచి పొంగి ప్రవహిస్తుంది. ఈ క్రమంలో హుకుంపేట మండలం అడ్డుమండకు చెందిన కుమారస్వామి.. రోజువారీ పనుల నిమిత్తం ఇంటి నుంచి బయలుదేరాడు. దిగుమోదాపుట్టు వద్ద వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో కాసేపు ఆగాడు. ప్రవాహం తక్కువే ఉంది కదా అని దాటేందుకు  ప్రయత్నించాడు. అక్కడే ఉన్న గిరిజనలు వద్దని వారించినా వినలేదు. ఈజీగా వెళ్ళిపోవచ్చు అని అనుకుని.. బయలుదేరాడు. రెండు అడుగులు వెళ్లిన తర్వాత.. వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో వాగులో కొట్టుకుపోయాడు కుమారస్వామి. సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. కుమారస్వామి గల్లంతుతో.. ఆ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది.

అల్లూరి సీతారామ రాజు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం ఉండాలని జిల్లా  ఎస్పీ అమిత్ బర్దార్ సూచించారు. ఈ మేరకు ప్రజలకు కొన్ని సూచనలు చేశారు.

  • పొంగిపొర్లుతున్న కల్వర్టులు, వాగులు, నదుల దగ్గరకు వెళ్లొద్దు
  • నీరు నిండిన లేదా పొంగిపొర్లుతున్న వంతెనలను దాటడానికి ప్రయత్నించవద్దు.
  • దూర ప్రాంతాలకు, ముఖ్యంగా అటవీ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలో అనవసరమైన ప్రయాణాలు చేయకుండా ఉండండి.
  • వాతావరణ హెచ్చరికలతో ఎప్పటికి అప్పుడు తెలుసుకుంటూ ఉండండి, జిల్లా అధికారులు సూచనలను పాటించండి.
  • అత్యవసర పరిస్థితుల్లో, సహాయం కోసం వెంటనే స్థానిక అధికారులను లేదా కంట్రోల్ రూమ్‌ను 093929 18199 సంప్రదించండి.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.