Watch: నడి రోడ్డుపై రెండడుగుల వింత ఆకారం.. దగ్గరికి వెళ్లి చూడగా గుండె ఆగినంత పనైంది.. వీడియో

పెద్ద ముగ్గు, ఒక మట్టి బొమ్మ, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, రక్తం.. ఇవన్నీ కనిపించాయంటే గుండె జారి చేతిలోకి వస్తుంది. తెల్లవారుజామున మసక, మసక చీకటిలో నడిరోడ్డుపై రెండు అడుగుల మేర ఎత్తులో వింత ఆకారం వాహనదారులు కనిపించింది. తీరా ఏంటని దగ్గరికి వెళ్లి చూసేసరికి గుండె పగిలినంత పనైంది. చూసి వెంటనే పరుగున వెనక్కి వెళ్లిపోయారు.

Watch: నడి రోడ్డుపై రెండడుగుల వింత ఆకారం.. దగ్గరికి వెళ్లి చూడగా గుండె ఆగినంత పనైంది.. వీడియో
Black Magic
Follow us
Nalluri Naresh

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 26, 2024 | 11:35 AM

పెద్ద ముగ్గు, ఒక మట్టి బొమ్మ, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, రక్తం.. ఇవన్నీ కనిపించాయంటే గుండె జారి చేతిలోకి వస్తుంది. తెల్లవారుజామున మసక, మసక చీకటిలో నడిరోడ్డుపై రెండు అడుగుల మేర ఎత్తులో వింత ఆకారం వాహనదారులు కనిపించింది. తీరా ఏంటని దగ్గరికి వెళ్లి చూసేసరికి గుండె పగిలినంత పనైంది. చూసి వెంటనే పరుగున వెనక్కి వెళ్లిపోయారు. వాస్తవానికి, క్షుద్ర పూజలు.. చేతబడి.. ఈ పేర్లు వింటేనే జనాల వెన్నులో వణుకు పుడుతుంది. సత్యసాయి జిల్లాలో ఇప్పుడు క్షుద్ర పూజల కలకలం జనాన్ని బెంబేలెత్తిస్తోంది. లేపాక్షి మండలం పులమతి ప్రధాన రహదారిలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. నడిరోడ్డులో మట్టితో రెండు అడుగుల విగ్రహాన్ని పెట్టి.. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, రక్తంతో క్షుద్ర పూజలు చేశారు.

అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేయడంతో.. ఉదయం అటుగా వెళ్లిన వాహనదారులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు చూసి భయాందోళనకు గురయ్యారు. గుప్తనిధుల కోసమా?.. లేదా ఇంకా ఎవరిపైనైనా చేతబడి చేశారా?..అనే అనుమానంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. పది రోజులుగా చుట్టు పక్కల ప్రాంతాల్లో అనేక చోట్ల క్షుద్ర పూజలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. క్షుద్ర పూజలు చేసిన స్థానంలో రక్తపు మరకలు కనిపించడంతో స్థానికులు మరింతగా భయపడుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వందల నిమ్మకాయలు కోసి క్షుద్ర పూజలు క్షుద్ర పూజలు చేసినట్లు తెలుస్తోంది.

వీడియో చూడండి..

క్షుద్ర పూజలు జరిగిన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల క్రితం ఇప్పుడు ఎక్కడైతే క్షుద్ర పూజలు జరిగిన ప్రదేశం ఉందో అక్కడ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారికి యాక్సిడెంట్ జరిగిందని.. ఆ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రులో చికిత్స పొందుతున్నాడు.. అయితే.. గాయపడిన వ్యక్తి కోలుకోవాలని కర్ణాటక నుంచి స్వామీజీని తీసుకొచ్చి యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ఈ క్షుద్ర పూజలు చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం క్షుద్ర పూజలు జరిగిన ప్రదేశాన్ని పోలీసులు దగ్గరుండి శుభ్రం చేయించారు.

అయితే.. మూఢనమ్మకాలు, క్షుద్రపూజలపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. అయినప్పటికీ.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి మూఢనమ్మకాలు కొనసాగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

మూఢనమ్మకాలను నమ్మవద్దు.. విశ్వసించవద్దని టీవీ9 విజ్ఞప్తి చేస్తోంది..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..