AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ‘చిన్న పిల్లరా.. నా మరదలిని వదిలేయ్’.. ప్రేమకు అడ్డుగా ఉన్నాడని ఏకంగా స్నేహితుడినే..

ప్రేమకు అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి బావను దారుణంగా హతమార్చాడో కిరాతకుడు.. స్నేహితులతో కలిసి పక్కా స్కెచ్ వేసి ప్రేమకు ఉన్న అడ్డును తొలగించుకున్నాడు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం పురోహితినివలసలో జరిగిన ఈ దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Andhra: ‘చిన్న పిల్లరా.. నా మరదలిని వదిలేయ్’.. ప్రేమకు అడ్డుగా ఉన్నాడని ఏకంగా స్నేహితుడినే..
Parvathipuram Manyam district Crime News
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Jul 26, 2025 | 9:50 AM

Share

ప్రేమకు అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి బావను దారుణంగా హతమార్చాడో కిరాతకుడు.. స్నేహితులతో కలిసి పక్కా స్కెచ్ వేసి ప్రేమకు ఉన్న అడ్డును తొలగించుకున్నాడు. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం పురోహితినివలసలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.. ప్రేమకు అడ్డుగా ఉన్నాడని.. పక్కా ప్లాన్ ప్రకారం ప్రియురాలి బావను పిలిచి నిందితుడు చంపాడు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పురోహితునివలసకు చెందిన ఇంటర్ విద్యార్థినిని దేవుబుచ్చెంపేటకు చెందిన గుంట్రెడి శ్యామ్ అలియాస్ శంకరరావు అనే వ్యక్తి ప్రేమ పేరుతో వెంబడిస్తున్నాడు. మొదట్లో శ్యామ్ కు దూరంగా ఉన్న విద్యార్థిని తరువాత రోజుల్లో దగ్గరవుతూ వచ్చింది. ఇద్దరూ తరచూ కలుస్తూ మాట్లాడుకుంటూ ఉండేవారు. ఈ విషయం విద్యార్థిని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకురావడంతో వారు విద్యార్థిని మైనర్ బాలిక అని, ఆ అమ్మాయి వెంట పడటం తగదని శ్యామ్‌ను పలుమార్లు హెచ్చరించారు.

అయినప్పటికీ శ్యామ్ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే కాలేజ్ హాస్టల్ లో ఉన్న విద్యార్థినికి తన స్నేహితుల సహాయంతో మొబైల్ ఫోన్ అందజేశాడు శ్యామ్. దీంతో విద్యార్థిని కుటుంబసభ్యులు శ్యామ్ ను మరింత గట్టిగా హెచ్చరించాలని నిర్ణయించుకున్నారు. అయితే విద్యార్థిని అక్క భర్త వరుసకు బావ అయిన అబ్ధుల్, శ్యామ్ మంచి స్నేహితులు. వీరిద్దరూ తరచూ కలుస్తుంటారు. ఈ క్రమంలోనే తన మరదలికి ఫోన్ ఇవ్వడం తగదని, ఇలా విద్యార్థిని వెంట పడటం తప్పని, ప్రవర్తన మార్చుకోవాలని శ్యామ్ ను హెచ్చరించాడు అబ్దుల్. దీంతో శ్యామ్ ఎలాగైనా తనతో తన ప్రేమకు అడ్డుపడుతున్న అబ్దుల్ ను అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యి రాత్రి పదకొండు గంటల సమయంలో అబ్దుల్ కి ఫోన్ చేసి తాము ఉన్న ప్రదేశానికి రమ్మని చెప్పాడు. ముందు నుండి ఇద్దరు స్నేహితులు కావడంతో అబ్దుల్ కూడా శ్యామ్ ఫోన్ చేయగానే మరొక స్నేహితుడిని తీసుకొని శ్యామ్ ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. అప్పటికే అక్కడ ఐదుగురు స్నేహితులతో శ్యామ్ మద్యం మత్తులో ఉన్నాడు.

అబ్దుల్ అక్కడికి వెళ్లగానే శ్యామ్ ను కౌగిలించుకొని మన ఇద్దరం స్నేహితులం, నా మరదలిని వదిలేయ్, ఆమె చిన్న అమ్మాయి, మా కుటుంబం పరువు పోతుందని అర్ధించాడు. అందుకు శ్యామ్ పట్టరాని కోపంతో అబ్దుల్ పై విరుచుకుపడ్డాడు. అక్కడ కొంతసేపు అబ్దుల్ కి, శ్యామ్ కి ఘర్షణ అయ్యింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన శ్యామ్, పక్కనే ఉన్న కత్తిని తీసుకుని అబ్దుల్ పై దాడి చేశాడు. ఈ దాడిలో అబ్దుల్ తీవ్ర గాయాల పాలయ్యాడు. పరిస్థితి గమనించిన స్నేహితులు వెంటనే అబ్దుల్ ను సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అబ్దుల్ చికిత్స పొందుతూ మరణించాడు.

అబ్దుల్ మరణించిన వార్త తెలుసుకున్న శ్యామ్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం అబ్దుల్ మృతదేహాన్ని సాలూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి తరలించారు. ఈ ఘటన విద్యార్థిని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపడమే కాకుండా స్థానికులను భయాందోళనకు గురిచేసింది. పోలీసులు ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. శ్యామ్‌ పై హత్య నేరం కింద కేసు నమోదు చేశారు. అయితే హత్యలో శ్యామ్ తో పాటు మద్యం మత్తులో ఉన్న స్నేహితుల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన పై పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..