AP News: మహారాష్ట్రలో వరుసగా పిల్లల కిడ్నాప్.. విచారణలో జగ్గయ్యపేటలో తేలిన లింకులు.. ఆకస్మిక తనిఖీలు

మహారాష్ట్రలో గత ఏడాది వరసగా పిల్లల కిడ్నాప్. కట్ చేస్తే ఏడాది తర్వాత ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో తేలిన లింకులు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

AP News: మహారాష్ట్రలో వరుసగా పిల్లల కిడ్నాప్.. విచారణలో జగ్గయ్యపేటలో తేలిన లింకులు.. ఆకస్మిక తనిఖీలు
Child Abduction (Representative image)
Follow us

|

Updated on: Mar 08, 2023 | 4:15 PM

ఎన్టీఆర్ జిల్లాలో మహారాష్ట్ర పోలీసులు తనిఖీలు కలకలం రేపుతున్నాయి. ముంబైలో వరుస బాలురు మిస్సింగ్ ఘటనలపై అక్కడి పోలీసుల ఇక్కడ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముంబైలో బాలురను కిడ్నాప్ చేసి ఎన్టీఆర్ జిల్లాలో మూడు లక్షలకు ముఠా విక్రయాలు జరిపినట్లు  పోలీసులకు పక్కా సామాచారం అందింది. ఇందు కోసం ఓ గ్యాంగ్ పని చేస్తున్నట్లు వారు గుర్తించారు. మొత్తం 10 మంది నిందితులను గుర్తించారు మహారాష్ట్ర పోలీసులు. నిందితులు ఖమ్మం, విజయవాడ, హైదరాబాద్, జగ్గయ్యపేటకు చెందిన వారిగా ఐడెంటిఫై చేశారు.

విజయవాడ రామలింగేశ్వర్ నగర్‌కు చెందిన శ్రావణి, రంజిత.. జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో చిన్నారులను విక్రయించినట్లు గుర్తించారు. మహారాష్ట్రలోని అరబిక్ ట్యూషన్ పాయింట్ వద్ద చిన్నారులు కిడ్నాప్ చేసినట్లు దర్యాప్తులో తేల్చారు. ఏడాది క్రితం మహారాష్ట్రలో కిడ్నాప్‌కు గురైన బాలుడిని వత్సవాయి మండలం దేచుపాలెంలో రెండు రోజుల క్రితం  గుర్తించి.. రెస్క్యూ చేసి సురక్షితంగా ముంబైకి తరలించి.. తల్లిదండ్రులకు అప్పగించారు.  ఈ కేసులో కిడ్నాప్‌ చేసిన విజయవాడకు చెందిన మహిళ.. అలాగే మధ్యవర్తిగా వ్యవహరించిన జగ్గయ్యపేటకు చెందిన మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని ప్రశ్నిస్తే మరిన్ని లింకులు బయటపడ్డాయి.

మరికొంతమంది బాలురను జగ్గయ్యపేట, విసన్నపేట, విజయవాడలో విక్రయాలు జరిపినట్లుగా గుర్తించి, తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు నలుగురు బాలుర ఆచూకీని గుర్తించారు మహారాష్ట్ర పోలీసులు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..