Weather Forecast: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం.. అనంతరం తుఫాను.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు..!

Weather Forecast: ఉత్తర అండమాన్ సముద్రము.. దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రాగల 36 గంటలలో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్న..

Weather Forecast: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం.. అనంతరం తుఫాను.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు..!
Follow us

|

Updated on: Oct 11, 2021 | 10:15 AM

Weather Forecast: ఉత్తర అండమాన్ సముద్రము.. దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రాగల 36 గంటలలో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కొస్తాంధ్ర నుంచి రాయలసీమ మీదుగా ద్రోణి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం అల్పపీడనంగా మారే అవకాశాలు ఉండటంతో బంగాళాఖాతంలో బలపడి మరింత తుఫానుగా మారే అవకాశాలున్నాయని తెలిపింది.

బంగాళాఖాతంలో అండమాన్‌ దీవుల పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి గాలులతో ఉపరితల ద్రోణి 1500 మీటర్ల ఎత్తున, కోస్తాంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల మీదుగా ఆరేబియా సముద్రంపై ఉన్న మరో ఉపరితల ఆవర్తనం వరకు వ్యాపించింది. దీంతో మూడు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 17న రాష్ట్రాన్ని తాకాల్సిన ఈశాన్య రుతుపవనాలు 23వ తేదీ లేదా 24వ తేదీన వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక రాయలసీమలో ఒకటిరెండు చోట్ల వర్షాలు పడే అవకాశాలున్నట్లు పేర్కొంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :

దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. నేడు, రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ:

అలాగే రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఇక, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. నేడు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

ఇవీ కూడా చదవండి:

PM Kisan: రైతులకు అలర్ట్‌.. వీరికి పీఎం కిసాన్‌ స్కీమ్‌ కింద డబ్బులు రావు.. ఎందుకంటే..!

PM Mudra Yojana: రూ.50 వేల రుణం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. దరఖాస్తు చేసుకోండిలా.. పూర్తి వివరాలు..!