గేదెను ఢీకొట్టి అదుపుతప్పిన లారీ… 35 మందికి గాయాలు!

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నర్సాయపాలెం, పెద్దగుడిపాడు గ్రామాలకు చెందిన నలభైమంది బత్తాయి కూలీలు నాగార్జునసాగర్ వద్దగల హాలియా అనే గ్రామానికి బత్తాయి కాయలు కోసేందుకు కూలీకి వెళ్ళారు. కూలీపనులు ముగించుకొని స్వగ్రామాలకు లారీలో బయలుదేరా రు. యర్రగొండపాలెంకు నాలుగు కీలోమీటర్ల సమీపంలో గల మెట్టబోడుతాండ వద్దకు రాగానే ఎదురుగా గేదే అడ్డంరాగా, అతివేగంగా వస్తున్న కూలీల లారీ గేదేను ఢీకొని మూడు పల్టీలుకొట్టింది. లారీలోని నలభైమంది కూలీలలో గాయం సుబ్బులు.వీర్ల లింగయ్య అనే ఇద్దరు వ్యక్తులు […]

గేదెను ఢీకొట్టి అదుపుతప్పిన లారీ... 35 మందికి గాయాలు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Aug 21, 2019 | 6:47 PM

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నర్సాయపాలెం, పెద్దగుడిపాడు గ్రామాలకు చెందిన నలభైమంది బత్తాయి కూలీలు నాగార్జునసాగర్ వద్దగల హాలియా అనే గ్రామానికి బత్తాయి కాయలు కోసేందుకు కూలీకి వెళ్ళారు. కూలీపనులు ముగించుకొని స్వగ్రామాలకు లారీలో బయలుదేరా రు. యర్రగొండపాలెంకు నాలుగు కీలోమీటర్ల సమీపంలో గల మెట్టబోడుతాండ వద్దకు రాగానే ఎదురుగా గేదే అడ్డంరాగా, అతివేగంగా వస్తున్న కూలీల లారీ గేదేను ఢీకొని మూడు పల్టీలుకొట్టింది. లారీలోని నలభైమంది కూలీలలో గాయం సుబ్బులు.వీర్ల లింగయ్య అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకొన్న యర్రగొండపాలెం పోలీసులు ప్రమాదస్ధలానికి వెళ్ళి సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ రప్పించి లారీని పైకిలేపి.మిగతా గాయపడిన.వారందరిని త్రిపురాంతకం, దోర్నాల, మార్కాపురంనకు చెందిన 108 వాహనాల ద్వారా యర్రగొండపాలెం ప్రభుత్వ వైధ్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో పదహైదు మందికి కాళ్ళుచేతులు ఇరగగా ఇరవైమందికి గాయాలు అయినాయి. విషయం తెలుకొన్న ఇరుగ్రామాలవారు పెద్దఎత్తున వైధ్యశాలకు తరలివచ్చారు. క్షతగాత్రుల బంధువుల రోదనలతో వైధ్యశాల అంతటా విషాధషాయలు అలుముకొన్నాయి. ప్రమాదానికి కారణమైన లారీ డ్త్రెవర్ పరారైయ్యాడు. యర్రగొండపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.