TDP- Janasena: మూడు గంటలు.. 6 అంశాలు.. ఉమ్మడి మ్యానిఫెస్టోపై టీడీపీ-జనసేన క్లారిటీ..!
చంద్రబాబుతో ములాఖత్ అయ్యాక పొత్తు ప్రకటన చేసి.. ఏపీ పాలిటిక్స్‌ని హీటెక్కించారు జగన్. మళ్లీ ఇదే లొకేషన్.. రెండు పార్టీల ఉమ్మడి ప్రయాణంలో తొలి అడుగు పడింది. రాజమండ్రి జైలుకు ఎదురుగా ఉన్న మంజీరా హోటల్‌లో సమన్వయ కమిటీలతో కలిసి భేటీ అయ్యారు లోకేష్, పవన్‌కల్యాణ్. వారాహి, భవిష్యత్‌కి గ్యారెంటీ, నిజం గెలవాలి యాత్రలపై చర్చించారు. సీట్ల పంపకాలు మినహా మిగతా అన్ని అంశాలపై ప్రాధమికంగా ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.

రాజమండ్రి సెంట్రల్ జైల్.. తెలుగుదేశం-జనసేన పొత్తు మొగ్గ తొడిగింది ఇక్కడే. చంద్రబాబుతో ములాఖత్ అయ్యాక పొత్తు ప్రకటన చేసి.. ఏపీ పాలిటిక్స్‌ని హీటెక్కించారు జగన్. మళ్లీ ఇదే లొకేషన్.. రెండు పార్టీల ఉమ్మడి ప్రయాణంలో తొలి అడుగు పడింది. రాజమండ్రి జైలుకు ఎదురుగా ఉన్న మంజీరా హోటల్‌లో సమన్వయ కమిటీలతో కలిసి భేటీ అయ్యారు లోకేష్, పవన్‌కల్యాణ్. వారాహి, భవిష్యత్‌కి గ్యారెంటీ, నిజం గెలవాలి యాత్రలపై చర్చించారు. సీట్ల పంపకాలు మినహా మిగతా అన్ని అంశాలపై ప్రాధమికంగా ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రతి కార్యక్రమానికి రెండు పార్టీల కేడర్ హాజరయ్యేలా వ్యూహం నిర్మించుకున్నారట.
ఉమ్మడిగా జిల్లా, పార్లమెంట్, అసెంబ్లీ, మండల స్థాయిలో సమన్వయ కమిటీల ఏర్పాటుపై సమావేశంలో చర్చ జరిగింది. పొత్తులో ఎక్కడైనా ఇబ్బందులున్నా పరిష్కరించేలా కమిటీలకు బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించింది. నియోజకవర్గాల్లో రెండు పార్టీల ఇన్‌చార్జ్‌లు.. సమన్వయంతో, సర్దుబాట్లతో పనిచేసేలా నిర్ణయం తీసుకున్నారు.
గతంలో సీటు నాశించి.. పొత్తు వల్ల రాదనుకుని.. మరో ఆలోచనల్లో ఉన్న వారితో చర్చలు జరపాలని, సయోధ్య కుదర్చాలని నిర్ణయించారు. జగన్ సర్కారుపై ఒత్తిడి పెంచడమే ఎజెండాగా విడివిడిగాను, ఉమ్మడిగానూ ఉద్యమాలు చేస్తారు. రైతు సమస్యలు, కరవుపై ప్రధానంగా దృష్టి పెడతారు. ఓట్ల తొలగింపుపై కూడా కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు.
పొత్తయితే కుదిరింది.. వాట్ నెక్ట్స్ అంటే చాలా ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి రెండు పార్టీల ఎదుట. గతంలో దసరాకు మేనిఫెస్టో విడుదల చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అరెస్టు తర్వాత పరిస్థితులు మారడంతో మేనిఫెస్టో వాయిదా పడింది. అటు.. ఫిబ్రవరిలో మేనిఫెస్టో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు వైసీపీ అధ్యక్షుడు జగన్. ఈ పరిస్థితుల్లో విపక్షాల ఉమ్మడి మేనిఫెస్టో ఎప్పటికొస్తుందనేది మరో ప్రశ్న.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం
