AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indrakeeladri Teppotsavam: ఇంద్రకీలాద్రిపై మంత్రి కొట్టు వర్సెస్ మాజీమంత్రి వెల్లంపల్లి.. కారణం ఏంటో తెలుసా..?

ఇంద్రకీలాద్రిపై మంత్రి కొట్టు వర్సెస్ మాజీమంత్రి వెల్లంపల్లి రగడ తీవ్ర స్థాయికి చేరింది. దుర్గామల్లేశ్వరస్వామివార్ల తెప్పోత్సవం బోటుపై ఏటా అర్చకులతో పాటు మంత్రులు, అధికారులు కూడా ఎక్కేవారు. అయితే ఈ సారి అర్చకులు మాత్రమే హంసవాహనం ఎక్కాలనీ.. మిగిలిన వారెవరూ ఎక్కడానికి వీల్లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాలు జారీచేశారు.

Indrakeeladri Teppotsavam: ఇంద్రకీలాద్రిపై మంత్రి కొట్టు వర్సెస్ మాజీమంత్రి వెల్లంపల్లి.. కారణం ఏంటో తెలుసా..?
Kottu Satyanarayana vs Vellampalli Srinivas
Shaik Madar Saheb
|

Updated on: Oct 23, 2023 | 8:02 PM

Share

Kottu Satyanarayana vs Vellampalli Srinivas: శరన్నవరాత్రి, దసరా మహోత్సవాలతో ఇంద్రకీలాద్రి భూలోక కైలాసాన్ని తలపించింది. మూడేళ్ల తరువాత తొలిసారిగా తెప్పోత్సవం నిర్వహించడం ఈసారి హైలైట్‌.కానీ ఆదిలోనే వివాద పాదు ఎదురైంది. ఏపీ దేవాదయ మంత్రి వెల్లంపల్లి.. మంత్రి కొట్టు సత్యనారాయణ మధ్య తెప్పోత్సవం ముంగిట తగువు తెరపైకి వచ్చింది. అర్చకులు, అత్యవసర సిబ్బంది తప్ప హంస వాహనంలోకి మరెవర్నీ అనుమితించకూడదని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఐతే గతంలో హంసవాహన సేవలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈవో, కలెక్టర్‌ సహా వీఐపీలకు అనుమతి వుండేది. అదే తరహాలో ఈసారి హంసవాహన సేవలో పాల్గొవాలని భావించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌. ఇక్కడే కిరికిరి మొదలైంది. మంత్రిని ..నేనే హంసవాహనం ఎక్కడంలేదు. వాహనం ఎక్కడానికి వెల్లంపల్లి ఏమైనా అర్చకులా? ..ఐనా ఎవరి పాత్ర వాళ్లు పోషించాలని సెటైర్‌ విసిరారు మంత్రి కొట్టు.

ఐనా హంసవాహనంలోకి అర్చకులు,అత్యవసర సిబ్బంది తప్ప మరెవర్నీ అనుమితంచ కూడదనేది సమిష్టి నిర్ణయమన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ . అధికారులు, ప్రజాప్రతినిధుల కోసం హంసవాహనం వెనకాలే బోదిసిరి బోటును ఏర్పాటు చేశామన్నారు. అందుకు సంబంధించిన పాస్‌లు వెల్లంపల్లి శ్రీనివాస్‌కు వెళ్లాయి.కానీ తాజా పరిణామాల క్రమంలో ఆయన ఆ పాస్‌లను వెనక్కి తిప్పి పంపడం సంచలనం రేపింది.

తాజా పరిణామాలపై మంత్రి కొట్టు సత్యనారాయణ కూల్‌గా స్పందించారు. 9రోజులు వెల్లంపల్లి అమ్మవారి దర్శనం కోసం వచ్చారు. తన బంధుమిత్రులకు కూడా బేషుగ్గా దర్శనాలు ఇప్పించారు. మరి తెప్పోత్సవానికి ఎందుకు రాలేదో తనకూ తెలియదన్నారు.

అదీ మంత్రి కొట్టు సత్యానారాయణ మాట.మరి వెల్లంపల్లి రియాక్షన్‌ ఏంటీ? మాజీ దేవాదాయ మంత్రి. స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి తన ఇలాఖాలో తనకు అవమానం జరిగిందని భావించారా? మంత్రి కొట్టు వ్యాఖ్యలపై ఆగ్రహం చెందారా? పాస్‌లను వెనక్కి తిప్పి పంపడం అలకా? ఆగ్రహమా? ..మొత్తానికి మ్యాటర్‌ అగ్గిరాజేసింది. తెప్పోత్సవం సజావుగా ముగిసింది. తెప్పోత్సవానికి ముందుకు తలెత్తిన వివాదం మాటేంటి? ఇక వాట్‌ నెక్ట్స్‌? అనేది చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..