Antarvedi coastal: అసలేం జరుగుతోంది.. అంతర్వేదిలో సముద్రం మరింత ముందుకు.. ఎగిసిపడుతున్న రాకాసి ఆలలు..
సముద్రం ఏదో సంకేతమిస్తోంది. విరుచుకుపడతాను.. జాగ్రత్త అంటోందా? ప్రళయకాలాన్ని ముందే సూచిస్తోందా? సముద్ర గర్భంలో ఏంటా అలజడి. అంతుచిక్కని ఈ మిస్టరీ ఇప్పుడు శాస్త్రవేత్తలనూ కలవరపెడుతోంది. వణికిస్తున్న ఈ మిస్టరీ..
సముద్రం ఏదో సంకేతమిస్తోంది. విరుచుకుపడతాను.. జాగ్రత్త అంటోందా? ప్రళయకాలాన్ని ముందే సూచిస్తోందా? సముద్ర గర్భంలో ఏంటా అలజడి. అంతుచిక్కని ఈ మిస్టరీ ఇప్పుడు శాస్త్రవేత్తలనూ కలవరపెడుతోంది. వణికిస్తున్న ఈ మిస్టరీ ఏంటో అంతు చిక్కడం లేదు. తీర ప్రాంత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రోజు రెండు చిత్ర విచిత్ర పరిణామాలు కనిపించాయి. ఒకటి అంతర్వేది దగ్గర సముద్రం ముందుకు చొచ్చుకురావడం. అది కూడా 45 మీటర్ల మేర ముందుకొచ్చింది సముద్రం. అడపాదడపా సహజం అనుకుందాం… కానీ ఇదే బంగాళాఖాతం.. మరోచోట అంతే దూరం వెనక్కి వెళ్లిపోయింది.. అదే ఉప్పాడ. ఈ రెండింటికీ మధ్య దూరం.. జస్ట్ 128 కిలోమీటర్లు.. ! ఎలా సాధ్యం ఈ వింత
ఇదిలావుంటే ప్రస్తుతం అంతర్వేదిలో క్షణానికో రాకాసి అల ఎగసిపడుతోంది. ఎవరైనా సాగరంలో కాళ్లు పెడితే లోపలికి ఈడ్చుకెళ్లిపోతాయేమో అనిపించే స్థాయిలో అలలు కలవర పెడుతున్నాయి. సాధారణంగా అమావాస్య, పౌర్ణమి వేళల్లో ఆటుపోట్లు పెరుగుతుంటాయి. ఇప్పటికే సముద్రపు ఒడ్డున ఉన్న పలు షాపులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. సముద్రం ముందుకు రావడంతో ఆందోళనలో స్థానిక తీర వాసులు ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో షాపును కూడా ముంచేసింది.
అది ఖగోళ, భౌగోళిక సంబంధం. కానీ.. అనూహ్యంగా ఏంటీ సాగర మథనం.. ! సముద్రంలో భూప్రకంపనలే ఇలాంటి అలజడికి కారణమా? ఒక్కసారి సముద్ర గర్భంలో భూమి కంపించడం మొదలుపెడితే.. అది అలాగే చాలా రోజుల వరకూ కంటిన్యూ అవుతుందన్న భయాలుంటాయి.
ఒకవేళ ఇదే తరహాలో భూమి కంపించుకుంటూపోతే.. ఆ తీవ్రత ఇంకాస్త పెరిగితే.. అది సునామీకి కూడా దారి తీసే అవకాశం ఉందా? వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ IPCC ఓ భయంకరమైన రిపోర్ట్ ఇచ్చింది. వారు ఇచ్చిన రిపోర్టు ప్రకారం.. దేశంలోని 12 సిటీలు భవిష్యత్‌లో కనిపించకుండా పోతాయట. అందులో ఏపీ నుంచి విశాఖ కూడా ఉంది. గతేడాది అధ్యయనాల్లో కాకినాడ కూడా కొన్నేళ్లలో కనుమరుగు అవ్వడం ఖాయంగా తెలిసింది.
తాజా రిపోర్ట్‌ల ప్రకారం… ఏపీలోని విశాఖతో పాటు ముంబై, చెన్నై, కొచ్చి, కాండ్లా, ఓఖా, భావ్‌నగర్, మంగళూరు, మార్మగోవా, పారాదీప్, ఖిధిర్‌పూర్, ట్యూటుకోరిన్.. ఈ 12 సిటీస్.. సాగరంలో మునిగిపోవడం ఖాయం అంటున్నారు పరిశోధకులు.
ఇవి కూడా చదవండి: దిల్ మాంగే మోర్.. రిస్క్ ఎలాంటిదైనా ఇవి ఉండాల్సిందే.. కేబుల్ నుంచి భారతీయుల తరలింపులో వీటిదే కీ రోల్..