Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో సోమవారం, మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
మొంథా తుఫాన్ ప్రభావంతో ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి.

మొంథా తుఫాన్ ప్రభావంతో ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. అలాగే.. ఉపరితల చక్రవాత ఆవర్తనం ఒకటి విదర్భ దాని సమీపంలోని మరత్వాడ ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ఈరోజు ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది.
మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
రాయలసీమ:-
ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది.
మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
తెలంగాణ వాతావరణం అప్డేట్..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు :
ఉపరితల చక్రవాత ఆవర్తనం ఒకటి విదర్భ దాని సమీపంలోని మరత్వాడ ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ఈరోజు ఏర్పడింది. రాగల 3 రోజులకు వాతావరణ సూచన:
ఆదివారం, సోమవారం రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మంగళవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
