ప్రాణం మీదకు తెచ్చిన గుర్రపు స్వారీ సంప్రదాయం – కళ్ల ముందే నిండు ప్రాణం బలి, ఏమైందంటే
ఇది రాజుల కాలం నుండి వస్తున్న ఆనవాయితీ. దసరా రోజు గుర్రపు స్వారీ పారువేట కొనసాగుతుంది. ఈ ఆటలో గెలవాలనే ఉద్దేశంతో మద్దికెరకు చెందిన పృధ్వీరాజ్ గుర్రపు స్వారీ చేయటంలో శిక్షణ తీసుకుంటుండగా, దురదృష్టవశాత్తు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా గుర్రపు స్వారీలో జాగ్రత్తలు పాటించాలని నగరి వంశస్తులకు సూచిస్తున్నారు.
గుర్రపు స్వారీ ఓ యువకుడి ప్రాణం బలితీసుకుంది. గుర్రపు స్వారీ చేస్తూ కింద పడిన అతడు మృత్యువాతపడ్డాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా మద్దికేరలో చోటుచేసుకుంది. దసరా ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే గుర్రాల పారువేటలో పాల్గొని విజేతగా నిలవాలనే కోరికతో గుర్రపు స్వారీ చేస్తున్న వ్యక్తి ప్రమాదవశత్తు గుర్రపై నుండి కింద పడిపోయాడు. అలా కిందపడిన వెంటనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కర్నూలు జిల్లా మద్దికేరకు చెందిన పృథ్వీరాజ్ రాయుడు అనే యువకుడు బీఎన్ పేట నుంచి గుర్రంపై వస్తున్నాడు. అలా వస్తున్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో పృధ్వీరాజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పృథ్వీరాజ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం తర్వాత బంధువులకు అప్పగించనున్నారు.
రాజుల కాలం నుండి మద్దికేరలో చిన్న నగరి,పెద్ద నగరి వంశస్థుల మధ్య గుర్రపు స్వారీ ఆట మొదలవుతుంది. ఈ ఆట బొజ్జనాయన పేట నుండి మద్దికేర వరకు ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజు గుర్రాల పారవేట జరుగుతుంది. ఎవరైతే గుర్రం మీద బయల్దేరి భోజనానిపేట గ్రామం మీదుగా మద్దికేర గ్రామంలోకి ముందుగా వస్తారో వారే విజేతగా నిలుస్తారు . ఈ గుర్రపు స్వారీ లో విజయం వరించిన వారిని గ్రామంలో ఊరేగింపుగా చేస్తారు. ఇది రాజుల కాలం నుండి వస్తున్న ఆనవాయితీ. దసరా రోజు గుర్రపు స్వారీ పారువేట కొనసాగుతుంది. ఈ ఆటలో గెలవాలనే ఉద్దేశంతో మద్దికెరకు చెందిన పృధ్వీరాజ్ గుర్రపు స్వారీ చేయటంలో శిక్షణ తీసుకుంటుండగా, దురదృష్టవశాత్తు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా గుర్రపు స్వారీలో జాగ్రత్తలు పాటించాలని నగరి వంశస్తులకు సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..