AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: మాటలకందని విషాదం.. సాంబార్‌ గిన్నెలో పడి బాలుడు మృతి

మీ ఇంట్లో పిల్లలు అదే పనిగా మొబైల్ చూస్తున్నారా? సెల్‌ఫోన్ ఆటలో పడి పక్కన ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోతున్నారా? ఈప్రమాదం గురించి తెలిస్తే.. మనమంతా షాక్‌కు గురవ్వాల్సిందే.

AP News: మాటలకందని విషాదం.. సాంబార్‌ గిన్నెలో పడి బాలుడు మృతి
Jagadessh
Ram Naramaneni
|

Updated on: Nov 17, 2024 | 2:54 PM

Share

పైన ఫోటోలోని బాలుడ్ని చూడండి. అతడిని మృత్యువు ఈ విధంగా కబలిస్తుందని ఎవరూ ఊహించరు. బాలుడిది కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం వేమూగోడు. సెల్‌ఫోన్ ఆట మృత్యువును తీసుకొచ్చిందంటే నమ్మగలరా? కాని నమ్మితీరాల్సిందే. మొబైల్ గేమ్‌ ఇతన్ని బలితీసుకుంది.

మేనమామ పెళ్లి కోసం అమ్మనాన్నలతో కలిసి గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడు గ్రామానికి వెళ్లాడు బాలుడు జగదీష్. పెళ్లి కోసం సిద్ధం చేసిన వంటలన్ని ఓ రూమ్‌లో ఉంచారు. సెల్‌ఫోన్ ఆటలో మునిగిన బాలుడు చూడకుండా వెళ్లి సాంబార్ గిన్నెపై కూర్చున్నాడు. మూత పక్కకు జరగడంతో అందులో పడిపోయాడు. పిల్లాడు కేకలు వేయడంతో బయటకు తీసిన బంధువులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పిల్లాడిని బ్రతికించేందుకు వైద్యుల చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు బాలుడు. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న బాలుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

అందుకే పిల్లల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. వారి నిత్యం కనిపెట్టుకుంటూ ఉండాలి. వారు ప్రమాదాలను ఊహించలేరు. అందుకే పెద్దలు జాగ్రత్త తీసుకోవాలి. ఈ ఇంట్లో జరిగిన విషాదం ఏ ఇంట్లోనూ జరకూడదని కోరుకుందాం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..