AP News: స్కూల్ బ్యాగ్‌ లోనుంచి వింత శబ్దాలు..ఏంటా అని తెరిచి చూడగా గుండె గుభేల్!

ఏలూరు జిల్లాలో స్కూల్‌కి వెళుతున్న ఓ పాప బ్యాగ్లోకి పాము దూరింది. అసలే శనివారం వీకెండ్ ఈ ఒక్క రోజు స్కూల్‌కి వెళితే ఆదివారం సెలవు అనుకుంటూ హుషారుగా పరుగు పరుగున పుస్తకాల సంచి వేసుకొని బడి వైపు నడుస్తున్న ఓ విద్యార్థిని సడన్‌గా తన సంచిలో ఏదో కదులుతున్నట్లు అనిపించి అచేతనంగా ఆగింది.

AP News: స్కూల్ బ్యాగ్‌ లోనుంచి వింత శబ్దాలు..ఏంటా అని తెరిచి చూడగా గుండె గుభేల్!
A Snake Stuck In A School Bag
Follow us
B Ravi Kumar

| Edited By: Velpula Bharath Rao

Updated on: Nov 17, 2024 | 3:40 PM

పాము కలలోకి వస్తేనే ఉలిక్కి పడి లేస్తాం.. నిజంగా కంటికి కనిపిస్తే భయంతో పరుగులు పెడతాం. అది నిజంగా ఇంట్లోకి వస్తే ఇక కాళ్ళు చేతులు చల్లబడి పోయి పరుగు పరుగున పామును పట్టుకునే వారి సహాయం కోసం చూస్తాం. కాని ఏలూరు జిల్లాలో స్కూల్‌కి వెళుతున్న ఓ పాప బ్యాగ్ లోకి పాము దూరింది. అసలే శనివారం వీకెండ్ ఈ ఒక్క రోజు స్కూల్ కి వెళితే ఆదివారం సెలవు అనుకుంటూ హుషారుగా పరుగు పరుగున పుస్తకాల సంచి వేసుకొని బడి వైపు నడుస్తున్న పాప సడన్‌గా తన సంచిలో ఏదో కదులుతున్నట్లు అనిపించి అచేతనంగా ఆగింది. పక్కనే నడుస్తున్న వారికీ ఆ బ్యాగ్లో ఏదో శబ్దాలు వినిపించాయి. స్నేహితురాళ్లు అరవడంతో తన స్కూల్ బ్యాగును విసిరి కొట్టింది ఆ అమ్మాయి. గొండెను బిగబట్టి పిల్లలు ఆ సంచిలోకి తొగి చూసారు. అందులో పామును చూసి బిగ్గరగా కేకలు వేశారు.

పాములను చూస్తే మనకు ఎంతో భయం. ఎందుకంటే అవి విష జీవులు. కాటు వేస్తే మరణం తప్పదు. అయితే సాధారణంగా జనావాసాలలో మనుషులతో పాటు పాములు తిరుగుతుంటాయి. అయితే ఇటీవల కాలంలో పాములు కాళ్లకు వేసుకునే షులలో కనిపించడం, అదేవిధంగా ద్విచక్ర వాహనాల్లో సైతం కనిపించడం ఇప్పటివరకు చూసాం. అందుకే షూ వేసుకునే ముందు, ఖాళీ ప్రదేశాలలో పార్క్ చేసిన బైకులు నడిపే ముందు, గుబురుగా ఉన్న పొదలవైపు నడిచే క్రమంలోనూ అనుమానం వచ్చినప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని పలువురు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు ఏ సమయంలో పాములు ఎక్కడ ఉంటాయో మనకు తెలియదు కాబట్టి.. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఓ విద్యార్థిని స్కూల్ బ్యాగ్ లోనే పాము ప్రత్యక్షమవడంతో ఆ విద్యార్థితో పాటు సహచర విద్యార్థినులు భయంతో పరుగులు తీశారు. ఇంతకీ ఆ పాము ఆ బ్యాగులోకి ఎలా దూరింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే వివరాలు తెలుసుకుందాం.. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం వాడపల్లికి చెందిన వరలక్ష్మి అనే విద్యార్థిని కొత్తపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. అయితే ఎప్పటిలాగానే స్కూల్ బ్యాగ్ తన భుజాన తగిలించుకుని సహచర విద్యార్థినీలతో కలిసి స్కూలుకు బయలుదేరింది. స్కూలుకు వెళ్లే దారిలో బ్యాగులో ఏదో కదులుతున్నట్లు అలికిడి వరలక్ష్మికి తెలిసింది.

అంతేకాక బ్యాగ్ లోంచి శబ్దాలు రావడం కూడా సహచర విద్యార్థినులు గమనించారు. అసలు ఎందుకు ఆ శబ్దాలు వస్తున్నాయి బ్యాగులు ఏముంది అని అనుమానం వచ్చిన విద్యార్థినులు వెంటనే భుజానికి ఉన్న బ్యాగును కిందకు దించి ఓపెన్ చేశారు. ఇంతలో బుస్ బుస్ అంటూ శబ్దాలతో బ్యాగులో నుంచి వేగంగా ఓ పాము బయటకు వచ్చింది. దాంతో ఒక్కసారిగా విద్యార్థినులు అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి బ్యాగ్ వదిలేసి పరారయ్యారు. పక్కనే అది గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని బ్యాగ్‌ లోనుంచి బయటకు వచ్చిన పాముని కర్రలతో కొట్టి చంపేశారు. అయితే అది ఎంతో ప్రమాదకరమైన గోధుమ త్రాచుపాముగా నిర్ధారించుకున్నారు. ఒకవేళ పొరపాటున ఆ త్రాచుపాము విద్యార్థినిని కాటు వేసి ఉంటే ఎంతో ప్రమాదం జరిగి ఉండేది. అయితే ఎవరికి ఏటువంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో విద్యార్థినులు ఒక్కసారిగా షాకుకు గురయ్యారు.

వీడియో ఇదిగో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి