AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐదేళ్ల చిన్నారి కోసం రంగంలోకి ప్రధాని మోదీ.. తల్లి ఒడికి దూరమైన అరిహా షా కథ తెలుసా..?

సరిహద్దులు దాటిన ఒక తల్లి ఆవేదన.. ఖండంతరాలు దాటిన ఒక చిన్నారి మాతృత్వ వేదన.. ఇది కేవలం ఒక కస్టడీ కేసు కాదు.. తన మాతృభాషను, తన మూలాలను మర్చిపోతున్న ఒక భారతీయ చిన్నారి అరిహా షా కన్నీటి గాథ. నాలుగేళ్లుగా జర్మనీలో ఫోస్టర్ కేర్‌లో మగ్గుతున్న అరిహా అంశం ఇప్పుడు ప్రపంచ వేదికపైకి చేరింది. ఏకంగా ప్రధాని మోదీయే రంగంలోకి దిగారు.

ఐదేళ్ల చిన్నారి కోసం రంగంలోకి ప్రధాని మోదీ.. తల్లి ఒడికి దూరమైన అరిహా షా కథ తెలుసా..?
Baby Ariha Shah Case
Krishna S
|

Updated on: Jan 14, 2026 | 10:58 AM

Share

ఇది కేవలం ఒక చిన్నారి కస్టడీకి సంబంధించిన చట్టపరమైన వివాదం కాదు.. ఒక బిడ్డ తన మూలాలను, భాషను, సంస్కృతిని కోల్పోతున్న వైనంపై రెండు దేశాల మధ్య జరుగుతున్న సుదీర్ఘ పోరాటం. జర్మనీలో పెంపుడు సంరక్షణలో ఉన్న భారతీయ చిన్నారి అరిహా షాను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి భారత్ దౌత్యపరమైన అస్త్రాలను వేగవంతం చేసింది. 2021 సెప్టెంబర్‌లో అరిహాకు కేవలం ఏడు నెలల వయస్సు ఉన్నప్పుడు, ఆమెకు గాయాలయ్యాయనే నెపంతో జర్మన్ శిశు సంక్షేమ అధికారులు అరిహాను తల్లిదండ్రుల నుంచి వేరు చేశారు. ఇంట్లో ఆ చిన్నారికి హాని జరుగుతోందని అధికారులు భావించారు. అయితే ఆ తర్వాత తల్లిదండ్రులపై ఉన్న క్రిమినల్ అభియోగాలను కోర్టు కొట్టివేసింది. కానీ అరిహాను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించడానికి జర్మన్ కోర్టు నిరాకరిస్తూ, ఆమెను పెంపుడు కేంద్రంలోనే ఉంచాలని నిర్ణయించింది.

మాతృభాషకు దూరంగా.. సంస్కృతికి పరాయిగా..

ప్రస్తుతం ఐదేళ్ల వయస్సు ఉన్న అరిహాకు సంబంధించిన అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే..ఆమె తన మాతృభాషను మర్చిపోయి కేవలం జర్మన్ మాత్రమే మాట్లాడుతోంది. తన సొంత తల్లిదండ్రులను నెలకు రెండు సార్లు మాత్రమే అధికారుల పర్యవేక్షణలో కలుస్తోంది. ఒక భారతీయ బిడ్డ తన మూలాలకు, కుటుంబ విలువలకు దూరంగా పెరుగుతుండటంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

రంగంలోకి ప్రధాని మోదీ

భారత విదేశాంగ శాఖ గత నాలుగేళ్లుగా ఈ సమస్యపై జర్మనీతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌ వద్ద ఈ అంశాన్ని లేవనెత్తడం ప్రాధాన్యత సంతరించుకుంది.

భారత్ లేవనెత్తుతున్న మూడు ముఖ్య అంశాలు

సాంస్కృతిక గుర్తింపు: ఒక బిడ్డ తన దేశం, భాష, సంప్రదాయాలకు దూరంగా పెరగడం వల్ల ఆమె వ్యక్తిత్వం దెబ్బతింటుంది.

మానవతా దృక్పథం: ఈ కేసును కేవలం చట్టపరమైన ఫైళ్లలా కాకుండా తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోని బిడ్డ ఆవేదనగా చూడాలి.

న్యాయమైన చికిత్స: తల్లిదండ్రులపై క్రిమినల్ కేసులు లేనప్పుడు, బిడ్డను వేరుగా ఉంచడం అన్యాయమని భారత్ వాదిస్తోంది.

భారత్ కోరుతున్న పరిష్కారం

అరిహాను తిరిగి ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని లేదా కనీసం ఆమెను భారతదేశానికి పంపి ఇక్కడి సంస్కృతిలో పెరిగేలా చూడాలని భారత్ కోరుతోంది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఆమెకు భారతీయ భాష, సంప్రదాయాలు తెలిసేలా తగిన ఏర్పాట్లు చేయాలని జర్మనీని కోరింది. జర్మనీ అధికారులు కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తూ.. తమ న్యాయ వ్యవస్థ పరిధిలో సమతుల్యమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై రెండు దేశాల మధ్య చర్చలు అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పల్లీలు ఇలా తింటే బరువు పెరుగుతారా?
పల్లీలు ఇలా తింటే బరువు పెరుగుతారా?
భోగి వేడుకల్లో డోలు వాయించిన హోంమంత్రి అనిత.. వీడియో వైరల్
భోగి వేడుకల్లో డోలు వాయించిన హోంమంత్రి అనిత.. వీడియో వైరల్
చలికాలంలో రక్తహీనతకు చెక్.. బాబా రాందేవ్ చెప్పిన ABC జ్యూస్..
చలికాలంలో రక్తహీనతకు చెక్.. బాబా రాందేవ్ చెప్పిన ABC జ్యూస్..
సుజుకి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌, ఫీచర్స్‌, ధర ఎంతో తెల
సుజుకి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌, ఫీచర్స్‌, ధర ఎంతో తెల
మహిళలపై డీఎంకే ఎంపీ మారన్ వివాదాస్పద వ్యాఖ్యలు..!
మహిళలపై డీఎంకే ఎంపీ మారన్ వివాదాస్పద వ్యాఖ్యలు..!
ట్రంప్ ఫొటోలతో వినూత్నంగా సిపిఐ భోగి మంటలు.. నారాయణ ఏమన్నారంటే..
ట్రంప్ ఫొటోలతో వినూత్నంగా సిపిఐ భోగి మంటలు.. నారాయణ ఏమన్నారంటే..
ఇంట్లో పావురం గుడ్లు పెడితే ఏమవుతుంది.. అదృష్టమా లేక అశుభమా..?
ఇంట్లో పావురం గుడ్లు పెడితే ఏమవుతుంది.. అదృష్టమా లేక అశుభమా..?
కావాలనే తోక్కేస్తున్నారు.. నా దగ్గర అంత డబ్బు లేదు..
కావాలనే తోక్కేస్తున్నారు.. నా దగ్గర అంత డబ్బు లేదు..
సంక్రాంతి నాడు పొరపాటున కూడా ఈ పని చేయకండి.. అదృష్టం దూరమవుతుంది
సంక్రాంతి నాడు పొరపాటున కూడా ఈ పని చేయకండి.. అదృష్టం దూరమవుతుంది
'సింహాద్రి' హీరోయిన్ అంకిత గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది?
'సింహాద్రి' హీరోయిన్ అంకిత గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది?